Gold Price 17 February 2026 Today : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 February 2026,9:37 am

Gold Price 17 February 2026 Today : పసిడి ప్రియులకు ఇది నిజంగానే చల్లటి వార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు నేడు బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాల కారణంగా దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు Gold Prices నేలచూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు ఫిబ్రవరి 17, 2026 మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. మరి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold Price 17 February 2026 Today : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Price 17 February 2026 Today : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Price 17 February 2026 Today : భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారంపై ఏకంగా రూ.1200 మేర తగ్గింది. దీంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్వచ్ఛమైన బంగారం 24 Carat Gold విషయానికి వస్తే, 10 గ్రాములపై సుమారు రూ.1300 వరకు తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌తో Hyderabad పాటు విజయవాడ Vijayawada, విశాఖపట్నం, వరంగల్ ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలపడటం, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపై ఆసక్తి తగ్గించుకోవడంతో ధరల్లో ఈ పతనం చోటుచేసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ.1,56,430 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,390 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.1,56,430 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,390గా ఉంి.

వెండి ధరలు Silver Rates

బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. పారిశ్రామిక డిమాండ్ తగ్గడంతో వెండి ధరల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కిలో వెండి ధరపై కూడా ఈరోజు తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర హైదరాబాద్‌లో మంగళవారం రూ.2,67,900 వద్ద ఉంది.

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభం నాటికి నమోదైనవి. ఈ ధరల్లో జీఎస్టీ,  తరుగు, ఇతర పన్నులు కలపలేదు. జ్యువెలరీ షాపును బట్టి, ప్రాంతాన్ని బట్టి ఫైనల్ ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలర్స్ వద్ద కచ్చితమైన ధరను తెలుసుకోవడం ఉత్తమం.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి