Gold Silver Rate 8th April 2026 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ట్రంప్ ఎఫెక్ట్‌తో తగ్గిన బంగారం, వెండి ధరలు

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 April 2026,9:30 am

Gold Silver Rate 8th April 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది కచ్చితంగా శుభవార్తే! గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా నేలచూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ వ్యవహారాలు పసిడి మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా పడిపోవడంతో మగువలు, పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Gold Silver Rate 8th April 2026 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ట్రంప్ ఎఫెక్ట్‌తో తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 8th April 2026 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ట్రంప్ ఎఫెక్ట్‌తో తగ్గిన బంగారం, వెండి ధరలు

ఈరోజు (ఏప్రిల్ 8) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ మేర తగ్గాయి? అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు ఏంటి? ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Gold Silver Rate 8th April 2026 అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఊగిసలాట.. ట్రంప్ దెబ్బ!

పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గట్టి వార్నింగ్ గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. హార్ముజ్ జల సంధిని తక్షణమే తెరవాలని, లేదంటే రాత్రికి రాత్రే ఇరాన్‌ను నాశనం చేస్తామని, భీకర దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. దీంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నప్పటికీ, దౌత్యపరమైన పరిణామాలతో బంగారం ధరల్లో పతనం మొదలైంది.

Gold Silver Rate 8th April 2026 కాల్పుల విరమణ ఒప్పందం

అయితే, ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) పాటించేందుకు ట్రంప్ అంగీకరించారు. ఇందుకు ఇరాన్ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో వార్ ప్రీమియం తగ్గిపోయి పుత్తడి ధరలు దిగివచ్చాయి. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో గోల్డ్ రేటు ఔన్సుకు 141 డాలర్లు పెరిగి 4798 డాలర్లకు ఎగబాకడం గమనార్హం. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 76 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరలు ఇలా

దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు వినియోగదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 820 మేర భారీ తగ్గింపు నమోదైంది. దీంతో ప్రస్తుతం తులం రేటు రూ. 1,49,840 వద్ద ట్రేడ్ అవుతోంది.

22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ. 750 మేర పడిపోయి, ప్రస్తుతం తులం ధర రూ. 1,37,350 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలో భారీ పతనం: బంగారంతో పాటు వెండి ధర కూడా కుప్పకూలింది. కిలో వెండిపై ఏకంగా రూ. 5000 మేర తగ్గడంతో, ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,55,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 9 గంటల సమయంలో బులియన్ మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా నమోదు చేయబడినవి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక డిమాండ్, వస్తు సేవల పన్ను GST, తరుగు, Making Charges వంటి అంశాల ఆధారంగా మీరు కొనుగోలు చేసే సమయానికి షోరూమ్‌లలో ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేయడానికి వెళ్లే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో కచ్చితమైన ధరలను విచారించడం ఉత్తమం.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి