Gold, Silver Rate Today, 12 February 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు ..ఈరోజు పెరిగిన ధర చూస్తే !!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 12 February 2026, 9:35 am

Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్‌ పసిడి మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గుతాయని ఆశించిన వినియోగదారులకు షాక్ ఇస్తూ, నేడు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ‘తగ్గేదేలే’ అన్నట్లుగా దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన కూడా పసిడి తన జైత్రయాత్రను కొనసాగించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు నేడు మరింత వేగవంతమయ్యాయి. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ. 750 మేర పెరిగింది. ఈ పెరుగుదలతో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 1,46,300 వద్దకు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయి పెరుగుదల కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Gold, Silver Rate Today, 12 February 2026

Gold, Silver Rate Today, 12 February 2026

24 క్యారెట్ల బంగారం ధర చూస్తే..

24 క్యారెట్ల బంగారం ధర కూడా రికార్డు స్థాయికి ఎగబాకింది. తులం బంగారంపై ఈరోజు రూ. 820 మేర అదనపు భారం పడింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,59,600 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు మరియు కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు పెంచుకోవడం వంటి అంశాలు దేశీయ మార్కెట్‌లో ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని సురక్షితమైన మార్గంగా భావించి పెట్టుబడులు పెట్టడం ధరలకు రెక్కలు కట్టిస్తోంది.

వెండి ధర:

కొద్దిపాటి ఊరట బంగారం ధరలు ఆందోళన కలిగిస్తున్నా, వెండి ధరలు మాత్రం కొంత ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వెండి ధరలో ఎటువంటి మార్పు నమోదు కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 3,00,000 మార్క్ వద్దే స్థిరంగా కొనసాగుతోంది. వెండి రేటు భారీగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం స్థిరంగా ఉండటం కొంత ఊరటనిచ్చే విషయమే. అయితే, బంగారం ధరల ట్రెండ్‌ను బట్టి చూస్తే, వెండి కూడా త్వరలోనే మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp