
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునేవారికి గుడ్ న్యూస్
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి ధరలు తగ్గుతూ రావడంతో, మే 2 వరకు తగ్గుదల కొనసాగింది. అప్పట్లో చాలామంది నగలు కొనుగోలు చేసినప్పటికీ, మే 6న ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కొనుగోలు చేయాలనుకున్న వారు కొంత నిరాశ చెందారు. కానీ మే 7 నుంచి మళ్లీ బంగారం ధరలు పడిపోతూ ఉన్నాయి. ఈరోజు మే 15 నాడు కూడా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,130 తగ్గి రూ.93,930కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,950 తగ్గి రూ.86,100కి చేరింది. వెండి ధర కూడా రూ.1000 తగ్గి రూ.1,08,000కి చేరింది.
ధరల ఈ తగ్గుదల పరిశీలిస్తే.. మే 6తో పోలిస్తే ఇప్పటి వరకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,290 తగ్గింది. అలాగే ఏప్రిల్ 21తో పోలిస్తే మొత్తం రూ.4,420 తగ్గినట్టు గమనించవచ్చు. 22 క్యారెట్ల నగల బంగారం కూడా రూ.4,050 మేర తగ్గింది. అంటే గత నెలలో కొనుగోలు చేసినవారితో పోలిస్తే ఇప్పటి కొనుగోలు దారులు చాలా తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతున్నారు. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం అనిపిస్తోంది.
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునేవారికి గుడ్ న్యూస్
అయితే భవిష్యత్ ధరలపై స్పష్టత లేకపోవడం వల్ల కొనుగోలు చేయాలా వద్దా అనే ప్రశ్న ప్రజలలో ఉంది. బంగారం ధరలు తగ్గడానికి పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా ట్రేడ్ వార్ మందగించడం, బ్రిటన్‌తో భారత వాణిజ్య ఒప్పందాలు విజయవంతంగా పూర్తవడం, అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పడటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి బయటకు వస్తున్నారు. డాలర్ బలపడటంతో బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం భారతీయులు కూడా తెలివిగా వ్యవహరిస్తూ, అక్షయ తృతీయ సమయంలో కాకుండా ధరలు తగ్గిన తర్వాతే కొనుగోలు చేయడం గమనార్హం.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.