Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునేవారికి గుడ్ న్యూస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునేవారికి గుడ్ న్యూస్

 Authored By ramu | The Telugu News | Updated on :15 May 2025,3:00 pm

Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి ధరలు తగ్గుతూ రావడంతో, మే 2 వరకు తగ్గుదల కొనసాగింది. అప్పట్లో చాలామంది నగలు కొనుగోలు చేసినప్పటికీ, మే 6న ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కొనుగోలు చేయాలనుకున్న వారు కొంత నిరాశ చెందారు. కానీ మే 7 నుంచి మళ్లీ బంగారం ధరలు పడిపోతూ ఉన్నాయి. ఈరోజు మే 15 నాడు కూడా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,130 తగ్గి రూ.93,930కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,950 తగ్గి రూ.86,100కి చేరింది. వెండి ధర కూడా రూ.1000 తగ్గి రూ.1,08,000కి చేరింది.

ధరల ఈ తగ్గుదల పరిశీలిస్తే.. మే 6తో పోలిస్తే ఇప్పటి వరకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,290 తగ్గింది. అలాగే ఏప్రిల్ 21తో పోలిస్తే మొత్తం రూ.4,420 తగ్గినట్టు గమనించవచ్చు. 22 క్యారెట్ల నగల బంగారం కూడా రూ.4,050 మేర తగ్గింది. అంటే గత నెలలో కొనుగోలు చేసినవారితో పోలిస్తే ఇప్పటి కొనుగోలు దారులు చాలా తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతున్నారు. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం అనిపిస్తోంది.

Today Gold Rate బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునేవారికి గుడ్ న్యూస్

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునేవారికి గుడ్ న్యూస్

అయితే భవిష్యత్ ధరలపై స్పష్టత లేకపోవడం వల్ల కొనుగోలు చేయాలా వద్దా అనే ప్రశ్న ప్రజలలో ఉంది. బంగారం ధరలు తగ్గడానికి పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా ట్రేడ్ వార్ మందగించడం, బ్రిటన్‌తో భారత వాణిజ్య ఒప్పందాలు విజయవంతంగా పూర్తవడం, అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పడటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి బయటకు వస్తున్నారు. డాలర్ బలపడటంతో బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం భారతీయులు కూడా తెలివిగా వ్యవహరిస్తూ, అక్షయ తృతీయ సమయంలో కాకుండా ధరలు తగ్గిన తర్వాతే కొనుగోలు చేయడం గమనార్హం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది