Business idea : బెంగళూరుకు చెందిన కృష్ణన్ మహదేవన్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి వాళ్ల అమ్మ ఉమతో కలిసి ఇడ్లీ సెంటర్ ను నడుపుతున్నాడు. రోజూ వేలల్లో ఇడ్లీలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. విజయవంతంగా తన బిజినెస్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. నెలకు 1.5 టన్నుల బియ్యాన్ని, ఒక టన్ను ఉరద్ పప్పును వాడుతూ బెంగళూరు విజ్ఞాన్ నగర్‌లోని తన అయ్యర్ ఇడ్లీని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయ్యర్ ఇడ్లీ సెంటర్ లో కేవలం ఇడ్లీ మరియు చట్నీ ఆ రెండింటిని మాత్రమే విక్రయిస్తున్నారు కృష్ణన్ మహదేవన్. దాదాపు 20 ఏళ్లుగా ఈ రెండు ఐటెమ్స్‌తో లాభాలతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.అయ్యర్ ఇడ్లీని 2001 లో కృష్ణన్ మహదేవన్ వాళ్ల తండ్రి స్థాపించాడు. 2000 సంవత్సరంలో కృష్ణన్ తండ్రి, మహదేవన్, ఉద్యోగం కోల్పోవడంతో ఇడ్లీ పండి అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఈ వ్యాపారాన్ని సాగించే సమయంలో ఇంటిల్లి పాది వేకువజామునే లేచి పిండి సిద్ధం చేసేవాళ్లమని నిజంగా అవి చాలా కష్టమైన రోజులను గుర్తు చేసుకుంటాడు కృష్ణన్. మహదేవన్ ఒక్కడు చేసే ఈ ఇడ్లీ పిండి వ్యాపారం నుంచి వచ్చే డబ్బులపైనే ఐదుగురు బతకాలి. కష్టంగా సాగుతున్న ఆ రోజుల్లో తన మిత్రులు, శ్రేయోభిలాషుల సూచన మేరక మహదేవన్ 2001 సంవత్సరం లో ఇడ్లీ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభం అయితే అయ్యింది కానీ.. ప్రజల నుంచి గుర్తింపు మాత్రం అంత ఈజీగా రాలేదు. చాలా నెలల వరకు అన్ని ఖర్చులు పోనూ కేవలం రూ. 40 మాత్రమే మిగిలేది. అంటే నెలకు రూ. 1200 మాత్రమే. అలా అంచెలంచెలుగా ఎదిగామని.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డామో.. బిజినెస్ ను ఎలా నిర్వహించామో తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుందని కృష్ణన్ అంటున్నాడు.
కృష్ణన్ కు చిన్నప్పుడు ఏ వ్యాపకం ఉండేది కాదు. స్కూల్ నుంచి రాగానే నేరుగా షాప్ కు వెళ్లడం అక్కడ పని చేయడం అంతే ఇదొక్కటే తెలుసు. ఇలా కష్టంగా సాగుతుండగానే కృష్ణన్ తన డిగ్రీని, పీ.జీ ని పూర్తి చేశాడు. తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ప్రొఫెసర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. అనంతరం అతను గోల్డ్‌మన్ సాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ టీమ్‌లో చేరాడు. అక్కడ నాలుగు సంవత్సరాలు గడిపాడో లేదో ఇంటి నుంచి విషాద వార్త వినిపించింది. 2009లో కృష్ణన్ తండ్రి మహదేవన్ మరణించాడు. వ్యాపార బాధ్యతలు కృష్ణన్ తల్లి ఉమా తీసుకుంది. గోల్డ్‌మన్ సాక్స్‌లో మంచి ఉద్యోగంలో ఉన్న కృష్ణన్ తన ఉద్యోగాన్ని వదిలి తల్లికి సాయంగా వెళ్లాలనుకున్నాడు.
కానీ వాళ్ల అమ్మ దానికి ఒప్పుకోలేదు. ఇంత చదువు చదివి మళ్లీ షాపుకు రావడం ఏంటి.. అదే ఉద్యోగం చేయమని అనేదట.కానీ కృష్ణన్ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. అయ్యర్ ఇడ్లీ బాధ్యతలు తీసుకుని బిజినెస్ ను నడిపిస్తున్నాడు. ఈ సమయంలోనే కరోనా లాక్ డౌన్ వారికి మంచి లాభాలే తెచ్చిపెట్టింది. కృష్ణన్ నిర్ణయం పట్ల వాళ్ల అమ్మకు ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ లాక్ డౌన్ సమయంలో కృష్ణన్ చాలా బిజీగా గడిపేవాడు. నిరంతరం పని ఉండేది. ఒక్కోసారి తినడానికీ సమయం ఉండేది కాదని, వ్యాపారం చాలా బాగా వృద్ధి చెందిందని కృష్ణన్ చెబుతున్నాడు. ఇప్పుడు అయ్యర్ ఇడ్లీ రోజూ వేలల్లో ఇడ్లీలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.