
Business Idea jammu kashmir organic strawberry farmer Rashpal Singh earns success story
Business Idea : ఎంతో మంది రైతులు పంటలు పండిస్తారు. సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలనూ వేస్తారు. కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే అద్భుతమైన లాభాలను పొందుతారు. మిగిలిన వాళ్లంతా చాలీచాలని ఆదాయం మాత్రమే అందుకుంటారు. పంట వేయడం అందరూ చేసేదే. కానీ ఎలాంటి పంట వేస్తున్నాం.. ఏ కాలంలో వేస్తున్నాం.. దాని మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నాం అనే విషయాలపై రైతుల విజయం ఆధారపడి ఉంటుంది. జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలోని కూహ్ గ్రామానికి చెందిన రష్ పాల్ సింగ్… సాంప్రదాయ పంట అయిన గోధుమలను కాదని… సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను పండిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు.కూహ్ గ్రామంలో చాలా మంది రైులు సాంప్రదాయ పంటలైన గోధుమలు, మొక్కజొన్న పంటలను పండిస్తారు.
అందరిలాగే రష్ పాల్ సింగ్ కూడా గోధుమలు పండించే వాడు. కాయకష్టం చేసినా… ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది. రైతులను వివిధ రకాల పంటల వైపు మళ్లించడానికి అక్కడి ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో రష్ పాల్… స్ట్రాబెర్రీ పంట వైపు మళ్లాడు. పంట వేయాలని అయితే నిర్ణయించుకున్నాడు కానీ లాభాలు వస్తాయో లేదో అనే అనుమానం మాత్రం ఉండేది. కానీ ముందుకే వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు రష్ పాల్. అధునాతన పద్ధతులు ఉపయోగించి స్ట్రాబెర్రీ సాగు చేయడంతో.. దిగుబడి ఆశించిన మేర వచ్చింది. స్ట్రాబెర్రీలను ఉధంపూర్ లోని పండ్ల మండీలలో విక్రయించాడు రష్ పాల్ సింగ్.మండీలలో దళారుల నుండి కేవలం రూ. 15 నుండి రూ.20 మాత్రమే వచ్చేది. దాంతో తమ పంటను మండీలలో అమ్మడం మానేశాడు రష్ పాల్ సింగ్.
Business Idea jammu kashmir organic strawberry farmer Rashpal Singh earns success story
పన్నెట లలో ప్రైవేటు డీలర్లు నుండి రూ.35-40 చొప్పున నేరుగా ప్రయాణికులకు అలాగే పర్యాటకులకు అమ్మడం మొదలు పెట్టారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మరియు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ను కలిపే ఇతర లింక్ రోడ్‌ల పక్కన దుకాణాన్ని ఏర్పాటు చేశారు.10 మార్ల భూమిలో పండించిన పంట నుండి సుమారు రూ. 40 వేలు సంపాదించినట్లు చెప్పారు రష్ పాల్. తన స్ట్రాబెర్రీ పంట విజయవంతమైందని తెలిపాడు. క్రమంగా తన పంట విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు. రష్ పాల్ కొడుకు లడఖ్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. అక్కడ అతనికి నెలకు రూ. 20,000 జీతం చెల్లిస్తారు. రష్ పాల్ స్ట్రాబెర్రీ పంటను పండించి మంచి లాభాలు పొందిన తర్వాత… అతను తన కొడుకుని లడఖ్‌కు కూలీ కోసం పంపాల్సిన అవసరం లేదని చెప్పాడు రష్ పాల్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.