Pearl Farming: కరోనా చాలా మంది జీవితాల్ని కుదిపేసింది. చేస్తున్న జాబ్ కోల్పోయి ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కరోనా సామాన్యుడిని కోలుకోలేని దెబ్బతీసింది. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కున్న చాలా మంది జాబ్ కంటే ఏదోఒక లాభసాటి వ్యాపారం బెటర్ అని ఆలోచించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇలా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి మరో అద్బుతమైన వ్యాపారం గురించి ఎలా చేయాలి.. ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం..తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం ముత్యాల పెంపకం. ఇందులో లాభాల మార్జిన్ దాదాపు 10 రెట్లు ఉంటుంది.
అందుకే ముత్యాల పెంపకంపై ఈ మధ్యకాలంలో ఆసక్తి పెరుగుతోంది. పైగా ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీ కూడా లభిస్తోంది. ముత్యాల పెంపకం కోసం మీరు రూ.30,000 పెట్టుబడి పెడితే లాభం పది రెట్లు అంటే.. రూ.3 లక్షల వరకు పొందవచ్చు. ఇందుకు ముఖ్యంగా మూడు విషయాలపూ అవగాహన పెంచుకోవాలి. అవి చెరువులు, శిక్షణ, గుల్లలు. అందుక అనువైన, తగినంత స్థలం ఎంచుకుని చెరువు తవ్వుకోవాలి. ఖర్చులో 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. అలాగే వీటి పెంపకం కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వంటి ప్రాంతాల్లో శిక్షణ తీసుకోవచ్చు. అలాగే గుల్లల ఎంపిక కోసం బీహార్‌లోని దర్భంగా, సౌత్ ఇండియాలో మంచి నాణ్యత గల గుల్లలు లభిస్తాయి.గుల్లాలను సేకరించుకున్న తర్వాత ముందుగా వీటిని ఒక వలలో కట్టి వాటిని 10 నుంచి 15 రోజులు చెరువులో ఉంచాలి.
దీంతో గుల్లలు వాతావరణానికి అలవాటు పడేలా చేయవచ్చు. ఆ తర్వాత వీటని బయటకు తీసి సర్జరీ అంటే గుల్ల లోపల అచ్చు పెట్టడం చేయాలి. ఈ అచ్చుపై పూత వేయబడుతుంది, ఇది ఓస్టెర్ పొరను ఏర్పరుస్తుంది.. ఇదే ముత్యంగా మారుతుంది. అయితే ముత్యాలుగా మరిన తర్వాత ఒక్కో ఓస్టెర్‌లో రెండు ముత్యాలు పొందవచ్చు. ఒక ముత్యం రూ.120కి విక్రయించవచ్చు. ముత్యాల నాణ్యత మెరుగ్గా ఉంటే కొన్నిసార్లు రూ.200 లకు మించి అమ్ముకునే అవకాశం ఉంది. చిన్నపాటి చెరువులో సుమారు 1000 గుల్లలు వేసుకోవచ్చు. ఇందులో కొన్ని గుల్లలు పాడైపోయినా సుమారు 600 నుంచి 700 గుల్లలు మిగిలి ఉంటాయి. ఇలా ప్రతి ఓస్టెర్‌లో 2 ముత్యాలను కలిగి ఉండగా వీటి కనీస ధర రూ.120 కి అమ్మినా లక్షల్లో ఆదాయం పొందవచ్చు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.