Business Idea : త‌క్కువ పెట్టుబ‌డితో ముత్యాల సాగు.. ల‌క్ష‌ల్లో సంపాద‌న ఆస‌క్తి చూపుతున్న యువ‌త‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : త‌క్కువ పెట్టుబ‌డితో ముత్యాల సాగు.. ల‌క్ష‌ల్లో సంపాద‌న ఆస‌క్తి చూపుతున్న యువ‌త‌

 Authored By mallesh | The Telugu News | Updated on :24 June 2022,9:30 pm

Pearl Farming: క‌రోనా చాలా మంది జీవితాల్ని కుదిపేసింది. చేస్తున్న జాబ్ కోల్పోయి ఎంతో మంది ఇబ్బందులు ప‌డ్డారు. కొన్ని ల‌క్ష‌ల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డ్డారు. క‌రోనా సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ‌తీసింది. అయితే ఈ ప‌రిస్థితుల‌ను ఎదుర్కున్న చాలా మంది జాబ్ కంటే ఏదోఒక లాభ‌సాటి వ్యాపారం బెట‌ర్ అని ఆలోచించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇలా వ్యాపారం చేసుకోవాల‌నుకునే వారికి మ‌రో అద్బుత‌మైన వ్యాపారం గురించి ఎలా చేయాలి.. ఎంత ఆదాయం వ‌స్తుంది అనే విష‌యాల‌పై ఇప్పుడు తెలుసుకుందాం..తక్కువ పెట్టుబడితో లాభ‌సాటి వ్యాపారం ముత్యాల పెంపకం. ఇందులో లాభాల మార్జిన్ దాదాపు 10 రెట్లు ఉంటుంది.

అందుకే ముత్యాల పెంపకంపై ఈ మ‌ధ్య‌కాలంలో ఆస‌క్తి పెరుగుతోంది. పైగా ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీ కూడా ల‌భిస్తోంది. ముత్యాల పెంపకం కోసం మీరు రూ.30,000 పెట్టుబడి పెడితే లాభం ప‌ది రెట్లు అంటే.. రూ.3 లక్షల వరకు పొంద‌వ‌చ్చు. ఇందుకు ముఖ్యంగా మూడు విష‌యాల‌పూ అవ‌గాహ‌న పెంచుకోవాలి. అవి చెరువులు, శిక్షణ, గుల్లలు. అందుక అనువైన‌, త‌గినంత స్థలం ఎంచుకుని చెరువు త‌వ్వుకోవాలి. ఖర్చులో 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. అలాగే వీటి పెంప‌కం కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వంటి ప్రాంతాల్లో శిక్షణ తీసుకోవచ్చు. అలాగే గుల్లల ఎంపిక కోసం బీహార్‌లోని దర్భంగా, సౌత్ ఇండియాలో మంచి నాణ్యత గల గుల్లలు ల‌భిస్తాయి.గుల్లాల‌ను సేక‌రించుకున్న త‌ర్వాత ముందుగా వీటిని ఒక వలలో కట్టి వాటిని 10 నుంచి 15 రోజులు చెరువులో ఉంచాలి.

Pearl farming Business Idea which will give more than 10 times of profit

Pearl farming Business Idea which will give more than 10 times of profit

Business Idea : ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం..

దీంతో గుల్ల‌లు వాతావరణానికి అల‌వాటు ప‌డేలా చేయ‌వ‌చ్చు. ఆ తర్వాత వీట‌ని బయటకు తీసి సర్జరీ అంటే గుల్ల లోపల అచ్చు పెట్టడం చేయాలి. ఈ అచ్చుపై పూత వేయబడుతుంది, ఇది ఓస్టెర్ పొరను ఏర్పరుస్తుంది.. ఇదే ముత్యంగా మారుతుంది. అయితే ముత్యాలుగా మ‌రిన త‌ర్వాత ఒక్కో ఓస్టెర్‌లో రెండు ముత్యాలు పొంద‌వ‌చ్చు. ఒక‌ ముత్యం రూ.120కి విక్ర‌యించ‌వ‌చ్చు. ముత్యాల నాణ్యత మెరుగ్గా ఉంటే కొన్నిసార్లు రూ.200 లకు మించి అమ్ముకునే అవ‌కాశం ఉంది. చిన్న‌పాటి చెరువులో సుమారు 1000 గుల్లలు వేసుకోవ‌చ్చు. ఇందులో కొన్ని గుల్లలు పాడైపోయినా సుమారు 600 నుంచి 700 గుల్లలు మిగిలి ఉంటాయి. ఇలా ప్రతి ఓస్టెర్‌లో 2 ముత్యాలను క‌లిగి ఉండ‌గా వీటి కనీస ధర రూ.120 కి అమ్మినా ల‌క్ష‌ల్లో ఆదాయం పొంద‌వ‌చ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది