Home » Business » Pm Jan Dhan Yojana Rs 10000 Will Come To Your Account
Business

PM Jan Dhan Yojana : పీఎం జ‌న్ ధ‌న్ యోజ‌న‌.. మీ అకౌంట్‌లో డ‌బ్బులు లేక‌పోయిన ప‌ది వేలు విత్ డ్రా..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: May 11, 2025 4:29 pm
Advertisement

PM Jan Dhan Yojana  : ప్రస్తుత రోజుల్లో ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినా కనీస బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ. 10 వేలు ఉంచాల్సిన ప‌రిస్థితి. పేద వారు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నారు. అలాంటి వారందరినీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ ధన్ యోజన ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందిస్తోంది. ఈ ఖాతా తీసుకున్న తర్వాత ఎలాంటి బ్యాలెన్స్ లేకున్నా రూ. 10 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు.

Advertisement

PM Jan Dhan Yojana : పీఎం జ‌న్ ధ‌న్ యోజ‌న‌.. మీ అకౌంట్‌లో డ‌బ్బులు లేక‌పోయిన ప‌ది వేలు విత్ డ్రా..!

PM Jan Dhan Yojana మంచి ఆద‌ర‌ణ‌..

ఆపైన రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది. చాలా సౌకర్యాలు అందిస్తున్న జన్ ధన్ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 9, 2025 నాటికి జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ. 2.63 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. సగటున ఒక్కో ఖాతాలో డిపాజిట్ అమౌంట్ రూ. 4,760గా ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే పీఎంజేడీవై ఖాతాలు 55.28 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.

Advertisement

ప్రధాన్ మంత్రి జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు చెక్ బుక్, పాస్ బుక్, ప్రమాద బీమా వంటి అనేక రకాల బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటితో పాటు వినియోగదారులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా అవసరమైతే మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.ఈ పథకంలో బీమాతో సహా అనేక రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జీరో బ్యాలెన్స్ ఖాతా కోట్లాది మందికి పొదుపు ఖాతా, బీమా, పెన్షన్ వంటి ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి