Post Office : ప్రతి ఒక్కరూ కూడా తాము పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో రాబడి రావాలని కోరుకుంటారు. అదేవిధంగా పెట్టుబడి కూడా సురక్షితవంతమైనదిగా ఉండాలి. అలాగే ఏ విధంగా నువ్వు మోసపోకూడదు అని భావిస్తుంటారు. అయితే ఈ విధంగా ఆలోచించేవారు పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడిని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీ డబ్బు భద్రంగా ఉండడంతో పాటు అధిక లాభాలు కూడా వస్తాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అయితే నేటి కాలంలో మ్యూచువల్ ఫండ్స్ , స్టాక్ మార్కెట్ వంటివి అధిక రాబడులను అందిస్తున్నప్పటికీ వీటిలో పెట్టుబడి పెట్టడం అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మరియు స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితంగా ఉండదు. తద్వారా మీరు పెట్టిన పెట్టుబడి సైతం కోల్పోవాల్సి వస్తుంది. అయితే అలా కాకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందవచ్చు. ఈ విషయంలో పోస్టల్ శాఖ అందిస్తున్న నెలవారి ఆదాయ పథకం చాలా ముఖ్యమైనది. దీంతో మీరు ప్రతి నెల స్థిర ఆదాయాన్ని పొందడంతో పాటు మీరు పెట్టిన పెట్టుబడికి కూడా హామీ ఇవ్వబడుతుంది.
దీనిని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీం అని పిలుస్తారు. ఇక ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.40% ఉంది. దీనిని ఉపయోగించి మీరు కనీసం 1000 నుండి 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఉమ్మడిగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే దాదాపు 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే దీనికి పన్ను మినహాయింపు కూడా ఉండదు. ఇక ఈ పెట్టుబడి మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వమే సంరక్షకుడుగా వ్యవహరిస్తుంది.
అయితే ఈ పథకం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి పై వచ్చిన లాభాలను నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. లేదా నామినేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ లో కూడా వీటిని జమ చేసుకోవచ్చు. కావున అర్హులైన వారంతా ఈ ఖాతాను తెరవచ్చు. దీనికోసం ముందుగా పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరిచి ఆ తర్వాత నెల ఆదాయానికి సంబంధించిన దరఖాస్తు నింపి అవసరమైన పాత్రలతో అధికారులకు సమర్పించాలి.
ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి అత్యవసర సమయంలో కాలానికి ముందే విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఒక సంవత్సరానికి ముందే దీనిని ఉపసంహరించుకుంటే జీరో రేటు ఉంటుంది. ఈ పథకం ద్వారా 15 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే నెలకు రూ.9,250 వడ్డీ లభిస్తుంది. 12 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే రూ.7,400 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా ఈ పథకం ద్వారా మీరు మీ డబ్బులు సురక్షితంగా ఉంచడంతోపాటు ప్రతినెల వడ్డీ పొందవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.