SBI : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అప్రమత్తం చేస్తూ తాజాగా ఓ సందేశం పంపింది. అదేంటంటే..పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ తేదీ త్వరలో ముగుస్తుందని పేర్కొంది. మార్చి 31, 2022 తేదీ లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ఎస్బీఐ సూచించింది.ఎస్బీఐ అధికారులు పంపిన సందేశం ప్రకారం.. గడువు తేదీ ఈ ఏడాది మార్చి 31. అయితే, ఈ తేదీ గతేడాది సెప్టెంబర్ 30యే. కానీ, కరోనా నేపథ్యంలో గడువును ఎస్బీఐ అధికారులు పొడిగించారు.
ఇకపోతే ఎస్బీఐ ఖాతాదారులు తమ ఖాతాకు పాన్-ఆధార్ లింక్ చేసుకోకపోతే దాని ప్రభావం అకౌంట్స్ పైన పడుతుందని అధికారులు హెచ్చరించారు. కావును ఖాతాదారులు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింకేజీకి సంబంధించి మీ హోమ్ బ్రాంచిలో సంప్రదించాల్సి ఉంటుంది.అయితే, అలా కాకుండా మీరు డిజిటల్ గానూ పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్ వెబ్ సైట్ ద్వారా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లి లింక్ ఆధార్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన పాన్-ఆధార్ వివరాలు సమర్పించాలి.
ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లేదా ఓటీపీ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అనంతరం లింక్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అలా మీ ఆధార్- పాన్ లింక్ చేసుకోవచ్చు. లేదా.. 567678/ 56161 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా కూడా లింక్ చేయొచ్చు. నిజానికి ఈ ఆధార్-పాన్ కార్డు లింకేజీ గడువు గతేడాది సెప్టెంబర్ 30తోనే ముగియాల్సి ఉంది. కానీ, కొవిడ్ పరిస్థితులు లాక్ డౌన్ నేపథ్యంలో లింకేజీ కష్టమవుతుందని, ఆ గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.