SBI : ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. గడువులోగా ఈ పని చేయండి.. లేదంటే మీ లావాదేవీలపైన ప్రభావం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI : ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. గడువులోగా ఈ పని చేయండి.. లేదంటే మీ లావాదేవీలపైన ప్రభావం..

 Authored By mallesh | The Telugu News | Updated on :7 February 2022,10:00 pm

SBI : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అప్రమత్తం చేస్తూ తాజాగా ఓ సందేశం పంపింది. అదేంటంటే..పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ తేదీ త్వరలో ముగుస్తుందని పేర్కొంది. మార్చి 31, 2022 తేదీ లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ఎస్బీఐ సూచించింది.ఎస్బీఐ అధికారులు పంపిన సందేశం ప్రకారం.. గడువు తేదీ ఈ ఏడాది మార్చి 31. అయితే, ఈ తేదీ గతేడాది సెప్టెంబర్ 30యే. కానీ, కరోనా నేపథ్యంలో గడువును ఎస్బీఐ అధికారులు పొడిగించారు.

ఇకపోతే ఎస్బీఐ ఖాతాదారులు తమ ఖాతాకు పాన్-ఆధార్ లింక్ చేసుకోకపోతే దాని ప్రభావం అకౌంట్స్ పైన పడుతుందని అధికారులు హెచ్చరించారు. కావును ఖాతాదారులు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింకేజీకి సంబంధించి మీ హోమ్ బ్రాంచిలో సంప్రదించాల్సి ఉంటుంది.అయితే, అలా కాకుండా మీరు డిజిటల్ గానూ పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్ వెబ్ సైట్ ద్వారా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లి లింక్ ఆధార్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన పాన్-ఆధార్ వివరాలు సమర్పించాలి.

that will effect on your sbi transactions

that will effect on your sbi transactions

SBI : కరోనా నేపథ్యంలో గడువు పొడిగింపు..

ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లేదా ఓటీపీ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అనంతరం లింక్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అలా మీ ఆధార్- పాన్ లింక్ చేసుకోవచ్చు. లేదా.. 567678/ 56161 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా కూడా లింక్ చేయొచ్చు. నిజానికి ఈ ఆధార్-పాన్ కార్డు లింకేజీ గడువు గతేడాది సెప్టెంబర్ 30తోనే ముగియాల్సి ఉంది. కానీ, కొవిడ్ పరిస్థితులు లాక్ డౌన్ నేపథ్యంలో లింకేజీ కష్టమవుతుందని, ఆ గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది