Today Gold Price : అయ్యో..మళ్లీ బంగారం ధర పెరిగిందే..ఈరోజు ఎంత ఉందంటే !
Today Gold Price : భారతీయుల్లో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా మహిళలకైతే పసిడిపై అపారమైన ప్రేమ ఉంటుంది. ఇది కేవలం ఆభరణంగా కాదు, సంపదగా భావించి కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో అయితే బంగారం అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పెరిగి, ఒక దశలో రూ.1 లక్షను తాకాయి. అయితే గత వారం రోజులుగా ఈ ధరలు కాస్త స్థిరంగా, కొద్దిగా తగ్గుతూ ఉండటం పసిడి ప్రియులకు ఊరటనిచ్చింది.
Today Gold Price : అయ్యో..మళ్లీ బంగారం ధర పెరిగిందే..ఈరోజు ఎంత ఉందంటే !
మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ అంతా బంగారం ధరలు పెరుగుదలతో రికార్డులు సృష్టించాయి. కానీ తాజాగా మే నెల ప్రారంభం నాటికి ధరలు క్రమంగా తగ్గాయి. తిరిగి ఈరోజు కొద్దిగా పెరగడం గమనార్హం. మే 3, 2025 నాటి ధరల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు వంటి పట్టణాల్లో పది గ్రాముల పసిడి ధర రూ.96,270గా ఉంది. ఇది శుక్రవారంతో పోలిస్తే రూ.50 పెరుగుదల. అదే సమయంలో వెండి ధరలు మాత్రం భారీగా రూ.2,101 తగ్గి రూ.95,059కి చేరుకోవడం మరో విశేషం.
ధరలు స్వల్పంగా మారుతున్నా, పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనుగోళ్లు తగ్గే సూచనలు కనిపించటం లేదు. సాధారణంగా ధర తగ్గిన సమయంలోనే ఎక్కువ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధరలు తిరిగి పెరిగే అవకాశమూ ఉండటంతో, కొనుగోలుదారులు తక్కువ సమయంలో ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
This website uses cookies.