Abhaya Ganapati Temple : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘమన్న పురాణపండ
హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం, గణపతి మంత్ర పఠనం జీవన వైభవాన్ని అమోఘంగా మారుస్తాయని ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు.రాయదుర్గంలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ గ్రౌండ్స్ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన శ్రీ అభయ గణపతి దేవాలయంలో మూల విరాట్ ప్రతిష్టాపనకు ఆయన వేదవిదుల మంత్ర ధ్వనులమధ్య వైదిక సంప్రదాయానుసారం పూజార్చనలు జరిపారు.ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ ప్రతికూల శక్తులని పరిహరింప చెయ్యడంలో గణపతి మంత్రశక్తి అపారమైందని చెప్పారు. మూడులోకాలు శరణుజొచ్చె గణపతి భగవానుని ఆలయ ప్రారంభ వేడుకలో పాల్గొనడంతో వొళ్ళు గగుర్పొడుస్తోందని శ్రీనివాస్ పారవశ్యంగా వివరించారు.
Abhaya Ganapati Temple : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘమన్న పురాణపండ
ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఎమ్. రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలను దూరం చేసే అద్భుతాల అభయ గణపతిని అతి అరుదైన కృష్ణ శిలతో తయారు చేయించిన కాలనీ వాసుల్ని అభినందించారు. ప్రసన్నపుణ్యమైన చైతన్యంతో ఈ ఆలయ ప్రాంగణం, పరిసరాలు శోభిస్తున్నాయని అభయ గణపతి ఆలయ సౌందర్యాన్ని, విశేషాల్ని రమేష్ రెడ్డి చక్కగా వివరించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి ఆలయ కమిటీ పక్షాన ఆలయ ప్రారంభకులు పురాణపండ శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు.వందలాది భక్తుల సమక్షంలో అపూర్వంగా జరిగిన గణేశ హోమం, ప్రత్యేక పూజల్లో శ్రీ అమృతేశ్వరాలయం సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచించిన సహస్ర అపురూప గ్రంధాన్ని రమేష్ రెడ్డి ఆవిష్కరించి శ్రీనివాస్ నిర్విరామ పవిత్ర కృషిని అభినందించారు.
Abhaya Ganapati Temple : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘమన్న పురాణపండ
ఈ శ్రీకార్యంలో శ్రీ అభయగణపతి ఆలయ కమిటీ సభ్యులు జస్టిస్ డి.వి.ఆర్. వర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్, భాస్కర్ రెడ్డి, రాచకొండ రమేష్ , దాట్ల రవివర్మ, సంజయ్ కమటం, గొర్తి రవి ప్రసాద్, శ్రీనివాస్ రామ్ సాగర్, అమిత్ శర్మ, సందీప్ కమటం, శ్రీధర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.తొలుత శృంగేరికి చెందిన మహా పండితులు ఎన్.ఎస్. శర్మ బృందం సుమారు మూడుగంటలపాటు ఆలయ ప్రతిష్టకు సంబంధించిన మంత్ర భాగాలతో సమస్త వైదిక కార్య కలాపాల్ని సంప్రదాయంగా నిర్వహించడం అందరినీ విశేషంగా ఆకర్షించింది.కృష్ణ శిలతో ఈ అభయ గణపతి ఆలయాన్ని నిర్మించడంలో శిల్పనైపుణ్యాన్ని ప్రదర్శించిన జయలక్ష్మీ ఆచార్యులను ఐజి. రమేష్ రెడ్డి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.