Today Gold Price : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలు చేయాలంటే ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదు..!
ప్రధానాంశాలు:
Today Gold Price : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలు చేయాలంటే ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదు..!
Today Gold Price : హైదరాబాద్‌లో Hyderabad Gold price బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ₹440 తగ్గి ₹97,640గా నమోదైంది. అంతకు ముందు ధర ₹98,080గా ఉండగా, తాజాగా కొంత తక్కువగా కొనుగోలుదారులకు లభిస్తోంది.

Today Gold Price : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలు చేయాలంటే ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదు..!
Today Gold Price : 22 క్యారెట్ల బంగారానికి తగ్గింపు
22 క్యారెట్ల బంగారంపైనా తగ్గుదల కనిపించింది. 10 గ్రాములకు ₹400 తగ్గి ₹89,500కి చేరుకుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ సమయంలో ఈ ధరలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలలో ఉన్న హెచ్చుతగ్గులే దేశీయంగా కూడా ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక వెండి ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర ₹100 పెరిగి ₹1,11,000కు చేరుకుంది. బంగారం ధరలు తగ్గడం వలన కొనుగోలుదారుల ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.