Today Gold Price : బడ్జెట్ వేళ.. భారీగా తగ్గిన బంగారం , వెండి ధర ! ఈరోజు ధరలు చూస్తే !!

 Authored By sudheer | The Telugu News | Updated on :1 February 2026,9:32 am

ప్రధానాంశాలు:

  •  Today Gold Price : బడ్జెట్ వేళ.. భారీగా తగ్గిన బంగారం , వెండి ధర ! ఈరోజు ధరలు చూస్తే !!

Today Gold Price  : కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ పసిడి Today Gold Rates ప్రియులకు ఊహించని శుభవార్త అందింది. గత రెండు రోజులుగా దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహాతీతంగా కుప్పకూలుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ ఒక్కసారిగా బలపడింది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారంపై Gold పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్ బాండ్ల వైపు మళ్లుతున్నారు. దీంతో స్పాట్ గోల్డ్ రేటు అంతర్జాతీయంగా ఔన్స్‌కు దాదాపు 434 డాలర్ల మేర పడిపోయి, సుమారు 4,893 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Today Gold Price on February 1st 2026 : బడ్జెట్ వేళ..భారీగా తగ్గిన బంగారం , వెండి ధర ! ఈరోజు ధరలు చూస్తే !!

Today Gold Price on February 1st 2026 : బడ్జెట్ వేళ..భారీగా తగ్గిన బంగారం , వెండి ధర ! ఈరోజు ధరలు చూస్తే !!

Today Gold Price హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ధరలు

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు రికార్డు స్థాయిలో దిగివచ్చాయి. గడిచిన రెండు రోజుల్లోనే తులం బంగారంపై దాదాపు రూ. 18,000 పైగా కోత పడటం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం: నేడు 10 గ్రాముల ధర రూ. 8,620 మేర తగ్గి రూ. 1,60,580 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం: తులంపై రూ. 7,900 వరకు పడిపోయి రూ. 1,47,200 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్ అంచనాలు మరియు గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి కారణంగా వినియోగదారులకు ఇది కొనుగోలు చేయడానికి ఒక మంచి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Today Gold Price వెండి ధరలో కనీవినీ ఎరుగని పతనం

బంగారం కంటే ఎక్కువగా వెండి ధర అగాధంలోకి పడిపోయింది. 1980 తర్వాత ఒకే రోజులో వెండి ఇంత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. క్రితం రోజు కిలోపై రూ. 20,000 తగ్గిన వెండి, నేడు ఏకంగా రూ. 85,000 మేర కుప్పకూలింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 3,20,000 వద్దకు పడిపోయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే లక్ష రూపాయలకు పైగా ధర తగ్గడం బులియన్ రంగంలో పెను సంచలనంగా మారింది. డాలర్ ఇండెక్స్ పెరగడం మరియు బడ్జెట్ వేళ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఈ మార్కెట్ క్రాష్‌కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి