Property : ఈ మధ్య కాలంలోచాలా మంది ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు. ఆ క్రమంలోనే కొంచెం డబ్బును ఇళ్లు లేదా భూమి కొనుగోలు కోసం ఆదా చేస్తుంటారు. అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మోసపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలనే విషయాలను చూద్దాం. భూమిని కొనుగోలు చేసే ముందు చూడాల్సిన ముఖ్యమైన పత్రం మదర్ డీడ్ అని.. ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా చెక్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ పత్రం ద్వారా భూమి యజమాని ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చట.
ఇదే కాకుండా ఒకవేళ భూమి యజమాని దానిని విక్రయిస్తే కొనుగోలుదారుకు బదిలీ చేసే సేల్ డీడ్ డాక్యుమెంట్‌ను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఇంకా భూమిని కొనుగోలు చేసే ముందు ఆ సమయంలో పాత రిజిస్ట్రీని చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. దీనిని పరిశీలించడం వల్ల మీరు కొనుగోలు చేస్తున్న భూమి ఎవరి పేరిట ఉందో స్పష్టంగా తెలుస్తుందని వివరించారు.భూమి విక్రేత కనుక యజమాని కాకపోతే, ప్లాట్‌ని విక్రయించేందుకు వాళ్ళకు పవర్ ఆఫ్ అటార్నీ ఉండాలి. ఎవరైనా విక్రేత నుంచి కొనేటప్పుడు ఎల్లప్పుడూ పవర్ ఆఫ్ అటార్నీని చెక్ చేయాలి.విక్రయ ఒప్పందం రికార్డులు విక్రేత నుంచి కొనుగోలుదారు భూ యాజమాన్యాన్ని బదిలీ చేస్తుంది. మీరు దీనిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యాలిడేట్ చేయించుకోవచ్చు.
భూమికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ డాక్యుమెంట్ చేస్తుంది. మీరు కొంటున్న భూమికి ఎలాంటి ఆర్థికపరమైన లేదా చట్టబద్ధ భారాలు లేవనడానికి ఇది ధృవీకరణగా పని చేస్తుంది.భవనం లైసెన్స్ పొందడానికి ఖాతా సర్టిఫికెట్ తప్పనిసరి. దీనిలో లొకేషన్, సైజ్, బిల్ట్-అప్ ఏరియా లాంటి ఆస్తి వివరాలు ఉంటాయి మరియు ఆస్తి పన్ను చెల్లించడానికి మరియు భవనం లైసెన్స్ పొందడానికి అవసరం.ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఈ ముఖ్యమైన పత్రాలను పరిశీలించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే హడావిడిగా కాకుండా అన్ని పత్రాలనూ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే భూమిని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు మోసాల బారి నుండి పడకుండా ఉంటారు.
MP Raghunandan Rao : కుల గణన అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది..సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే…
Jr NTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా…
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైందని Uppal congress Incharge…
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి అప్డేట్ అంటే ఫ్యాన్స్ కి స్పెషల్ ఫెస్టివల్ అన్నట్టే లెక్క.…
Laila Movie Trailer : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రామ్ నారాయణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా…
Thandel Movie Review : నాగ చైతన్య కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. కాని ఈ…
Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ Jr Ntr టాలీవుడ్ Tollywood టాప్ హీరోలలో ఒకరు అనే విషయం…
Uric Acid : ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య యూరిక్ యాసిడ్ మరియు ఆర్థరైటిస్ నొప్పులు. కొంతమందికి…
This website uses cookies.