Business Idea : జనరేషన్ మారింది బాస్. చదువుకోని వాళ్లే టీ అమ్మాలి.. ఇస్త్రీ చేయాలి.. కూలి పని చేయాలి అనే రోజులు పోయాయి. ఎందుకంటే.. చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి కూడా బాగా చదువుకున్న వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ చిన్న వ్యాపారాన్నే వెరైటీగా చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అందుకే ఎంఎన్సీ కంపెనీలలో పని చేస్తున్న వాళ్లు కూడా, లక్షల జీతాలు వస్తున్న వాళ్లు కూడా ఉద్యోగాన్ని మానేసి పలు వ్యాపారాలు చేస్తున్నారు. అలా ఓ యువతి తన కార్పొరేట్ జాబ్ వదిలేసి.. టీ షాప్ పెట్టింది. ఇప్పుడు లక్షలు గడిస్తోంది.
కేరళలోని కొచ్చికి చెందిన సెరెనాకు మంచి జాబ్ ఉంది. లక్షల జీతం. కానీ.. తనకు ఆ జాబ్ అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో టీ షాప్ పెట్టాలని అనుకుంది. తన ఐడియాను ఫ్యామిలీకి చెబితే వద్దన్నారు. మంచి ఉద్యోగం వదిలేసి టీ షాప్ ఏంటి అంటూ తనను వారించారు. కానీ.. తను మాత్రం తన మనసు మాట విన్నది. జాబ్ కు రాజీనామా చేసి కొచ్చిలో టీ షాప్ పెట్టింది. నిజానికి.. సెరెనా భర్త ఒకప్పుడు గల్ఫ్ లో ఉద్యోగం చేసేవాడు. కరోనా వల్ల జాబ్ పోవడంతో తిరిగి కేరళ వచ్చేశాడు. అప్పుడే ఇద్దరూ కలిసి టీ షాప్ పెట్టాలని భావించారు.
కేరళలోని వెల్లింగ్ డన్ ఐలాండ్ లో డైనింగ్ ఐలాండ్ అనే టీ షాప్ ను ఏర్పాటు చేశారు. స్ట్రా బెర్రీ టీ, హిబిస్కస్ టీ, సిన్నామన్ టీ, పెప్పర్ టీ, ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్ట్ టీ ఇలా… 50 రకాల చాయ్ తో పాటు కూల్ డ్రిక్స్, స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. ఇద్దరూ కలిసి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మరీ ఈ షాప్ ను ఏర్పాటు చేశారు. మధ్యలో ఈ షాపు కొన్ని లీగల్ సమస్యలు వచ్చినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఇప్పుడు కస్టమర్లు కూడా పెరగడంతో మంచి లాభాలను గడిస్తూ సంతోషంగా ఉంటున్నారు సెరెనా ఫ్యామిలీ.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.