Business Idea : టీ షాప్ పెట్టడం కోసం లక్షల జీతం వచ్చే కార్పొరేట్ జాబ్ ను వదిలేసింది.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : టీ షాప్ పెట్టడం కోసం లక్షల జీతం వచ్చే కార్పొరేట్ జాబ్ ను వదిలేసింది.. ఎక్కడో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :6 February 2023,2:00 pm

Business Idea : జనరేషన్ మారింది బాస్. చదువుకోని వాళ్లే టీ అమ్మాలి.. ఇస్త్రీ చేయాలి.. కూలి పని చేయాలి అనే రోజులు పోయాయి. ఎందుకంటే.. చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి కూడా బాగా చదువుకున్న వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ చిన్న వ్యాపారాన్నే వెరైటీగా చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అందుకే ఎంఎన్సీ కంపెనీలలో పని చేస్తున్న వాళ్లు కూడా, లక్షల జీతాలు వస్తున్న వాళ్లు కూడా ఉద్యోగాన్ని మానేసి పలు వ్యాపారాలు చేస్తున్నారు. అలా ఓ యువతి తన కార్పొరేట్ జాబ్ వదిలేసి.. టీ షాప్ పెట్టింది. ఇప్పుడు లక్షలు గడిస్తోంది.

Business Idea in w0man quits mnc job to start tea shop in kerala

Business Idea in w0man quits mnc job to start tea shop in kerala

కేరళలోని కొచ్చికి చెందిన సెరెనాకు మంచి జాబ్ ఉంది. లక్షల జీతం. కానీ.. తనకు ఆ జాబ్ అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో టీ షాప్ పెట్టాలని అనుకుంది. తన ఐడియాను ఫ్యామిలీకి చెబితే వద్దన్నారు. మంచి ఉద్యోగం వదిలేసి టీ షాప్ ఏంటి అంటూ తనను వారించారు. కానీ.. తను మాత్రం తన మనసు మాట విన్నది. జాబ్ కు రాజీనామా చేసి కొచ్చిలో టీ షాప్ పెట్టింది. నిజానికి.. సెరెనా భర్త ఒకప్పుడు గల్ఫ్ లో ఉద్యోగం చేసేవాడు. కరోనా వల్ల జాబ్ పోవడంతో తిరిగి కేరళ వచ్చేశాడు. అప్పుడే ఇద్దరూ కలిసి టీ షాప్ పెట్టాలని భావించారు.

Business Idea in w0man quits mnc job to start tea shop in kerala

Business Idea in w0man quits mnc job to start tea shop in-kerala

Business Idea : 50 రకాలా చాయ్ అమ్ముతూ లక్షల సంపాదన

కేరళలోని వెల్లింగ్ డన్ ఐలాండ్ లో డైనింగ్ ఐలాండ్ అనే టీ షాప్ ను ఏర్పాటు చేశారు. స్ట్రా బెర్రీ టీ, హిబిస్కస్ టీ, సిన్నామన్ టీ, పెప్పర్ టీ, ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్ట్ టీ ఇలా… 50 రకాల చాయ్ తో పాటు కూల్ డ్రిక్స్, స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. ఇద్దరూ కలిసి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మరీ ఈ షాప్ ను ఏర్పాటు చేశారు. మధ్యలో ఈ షాపు కొన్ని లీగల్ సమస్యలు వచ్చినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఇప్పుడు కస్టమర్లు కూడా పెరగడంతో మంచి లాభాలను గడిస్తూ సంతోషంగా ఉంటున్నారు సెరెనా ఫ్యామిలీ.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది