Brahmam Gari Kalagnanam : 2023లో జరగబోయేది ముందే చెప్పిన బ్రహ్మంగారు .. పూర్తిగా చదివితే ఆశ్చర్యపోతారు .. వీడియో

Advertisement

Brahmam Gari Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన అపారమైన మేధస్సుతో భవిష్యత్తులో జరగబోయేది ముందే కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటికి ఎక్కడైనా వింత జరిగిన అది బ్రహ్మంగారి చెప్పినట్లే జరిగింది అనుకుంటూ ఉంటాం. ఆయన కాలజ్ఞానంలో కోరంగిని మహమ్మారి వలన కోట్లాది జనం చనిపోతారని చెప్పారు ఆ విధంగానే కరోనా వైరస్ వచ్చాక చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది అని అంతా అనుకున్నారు అయితే 2023 లో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు ముందే చెప్పారు. కరోనా తర్వాత ఒమిక్రాన్ వైరస్ వస్తుందని తెలిపారు.

2023 Brahmam Gari Kalagnanam
2023 Brahmam Gari Kalagnanam

అలాగే అక్రమ సంబంధాలు వలన మందులేని వ్యాధితో ఎంతోమంది చనిపోతారని చెప్పారు. ఆ విధంగానే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికి మందు లేదు. అలాగే కృష్ణా నది కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుందని చెప్పారు. కృష్ణా నది ఉప్పొంగితే నాగార్జున డ్యాం బీటలు వారి కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది. అలాగే ఓ అమ్మ రాజ్యాన్ని 16 సంవత్సరాలు రక్షిస్తుంది అని అన్నారు. ఆ విధంగానే ఇందిరాదేవి మన దేశాన్ని 16 సంవత్సరాలు పరిపాలించారు. ఒక మొసలి భ్రమరాంబ గుడిలో చేరి ఎనిమిది రోజులు అక్కడ ఉండి మేకపోతుల అరిసి మాయమవుతుంది అని అన్నారు.

Advertisement

2032 నాటికి యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని చెప్పారు. ఆరేళ్ల పాప గర్భవతి అవుతుందని, ఇక ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడానీ, స్త్రీలు మానం అమ్ముకుంటారని తెలిపారు. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతారని, దొంగ స్వాములు పుట్టుకొస్తారని కాలజ్ఞానంలో తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు. ప్రస్తుతం చిన్న పిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే 2023లో కరోనా పోతుంది అనుకుంటాం కానీ అది వదిలిపెట్టదని మళ్లీ వచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తుందని చెప్పారు.

Brahmam Gari Kalagnanam 2023 : రాసి పెట్టుకోండి.. ఉగాది తర్వాత బ్రహ్మంగారు చెప్పినట్టు  జరగబోయేది ఇదే…!! | The Telugu News

2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. వావి వరసలు మర్చిపోతారని తెలిపారు. ప్రస్తుతం అలాగే జరుగుతుంది. ఇక అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 2024 ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని, ఆ తర్వాత సీఎం అవుతాడని చెప్పారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గురించి ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అవుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాజుల పాలన నశించేనయ పాలించుటకు పవనుడు వచ్చేనయా అని రాసి ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ రాజ్యాన్ని ఏలుస్తాడని భావిస్తున్నారు.

Advertisement
Advertisement