Sankranti Festival : 2024లో భోగి, సంక్రాంతి, కనుమ ఎప్పుడు.? ఏ సమయంలో జరుపుకోవాలి..?
Sankranti Festival : ఈ 2024వ సంవత్సరంలో Sankranti భోగి bhogi festival,సంక్రాంతి Sankranti , కనుమ Kanuma festival పండుగలు ఎప్పుడు వచ్చాయి. ఆ పండుగ రోజులలో ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.. సంక్రాంతి పండగ.సంక్రాంతి పండగ అంటే సందడిగా ఉంటుంది. ఇంటిముందు రకరకాల ముగ్గులతో పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్ళు ఆడపడుచులు, పిల్లలతో సందడి సందడిగా ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులపాటు జరుపుకుంటారు. మొదటిది భోగి, రెండవది సంక్రాంతి ,మూడవ పండగ కనుమ పండుగ, మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగలో మొదటి రోజు వచ్చేసి భోగి పండుగ..
జనవరి 14 ఆదివారం రోజున వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి చవితి.. ఈ భోగి పండుగ అంటేనే భోగభాగ్యాలను తెచ్చిపెట్టే పండుగ ఈ భోగి రోజు భోగి స్నానం చేసి భోగి మంటలు పెట్టుకుంటారు. తర్వాత చిన్నపిల్లలకి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోవడానికి భోగి పండ్లను కూడా పోస్తారండి.. అలాగే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు. ఇక రెండవ రోజు వచ్చేసి సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ జనవరి 15 సోమవారం రోజున వచ్చింది. ఆరోజు తిధి పంచమి. ఇది ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి పండగ అంటారు. ఎందుకంటే ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈరోజు నుండి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయన కాలం మొదలవుతుంది. ఈరోజు పొంగల్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా నివేదిస్తారు. ఇక మూడవరోజు పండగ వచ్చేసి కనుమ పండగ. ఈ కనుమ పండుగ జనవరి 16 మంగళ వారం రోజున వచ్చింది. ఆరోజు తిధి షష్టి తిధి . ఈరోజు ముఖ్యంగా రైతులు తమ పొలం పనులలో సహాయం చేసే పశువులను కడిగి అందంగా అలంకరించి పూజిస్తారు. మీరు కూడా ఇలా సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు జరుపుకొని భోగభాగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము..
BC Reservation : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచేందుకు చేసిన ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది.…
YCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇటీవల కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన Ys Jagan అధినేత,…
Ticket Price Hike : సినీ టికెట్ల ధరల వివాదంపై తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. పవన్ కళ్యాణ్…
Wife : వామ్మో.. రోజు రోజుకూ కొందరు మనుషులు మృగాళ్లలా తయారు అవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలతో.. దంపతులు…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్…
Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన…
Today Gold Price : శ్రావణ మాసం Shravan maas ప్రారంభం కావడం తో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావాలు…
This website uses cookies.