Sankranti Festival : 2024లో భోగి, సంక్రాంతి, కనుమ ఎప్పుడు.? ఏ సమయంలో జరుపుకోవాలి..?
ప్రధానాంశాలు:
Sankranti Festival : 2024లో భోగి, సంక్రాంతి, కనుమ ఎప్పుడు.? ఏ సమయంలో జరుపుకోవాలి..?
Sankranti Festival : ఈ 2024వ సంవత్సరంలో Sankranti భోగి bhogi festival,సంక్రాంతి Sankranti , కనుమ Kanuma festival పండుగలు ఎప్పుడు వచ్చాయి. ఆ పండుగ రోజులలో ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.. సంక్రాంతి పండగ.సంక్రాంతి పండగ అంటే సందడిగా ఉంటుంది. ఇంటిముందు రకరకాల ముగ్గులతో పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్ళు ఆడపడుచులు, పిల్లలతో సందడి సందడిగా ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులపాటు జరుపుకుంటారు. మొదటిది భోగి, రెండవది సంక్రాంతి ,మూడవ పండగ కనుమ పండుగ, మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగలో మొదటి రోజు వచ్చేసి భోగి పండుగ..
జనవరి 14 ఆదివారం రోజున వచ్చింది. ఆ రోజు తిథి వచ్చేసి చవితి.. ఈ భోగి పండుగ అంటేనే భోగభాగ్యాలను తెచ్చిపెట్టే పండుగ ఈ భోగి రోజు భోగి స్నానం చేసి భోగి మంటలు పెట్టుకుంటారు. తర్వాత చిన్నపిల్లలకి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోవడానికి భోగి పండ్లను కూడా పోస్తారండి.. అలాగే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు. ఇక రెండవ రోజు వచ్చేసి సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ జనవరి 15 సోమవారం రోజున వచ్చింది. ఆరోజు తిధి పంచమి. ఇది ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి పండగ అంటారు. ఎందుకంటే ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈరోజు నుండి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయన కాలం మొదలవుతుంది. ఈరోజు పొంగల్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా నివేదిస్తారు. ఇక మూడవరోజు పండగ వచ్చేసి కనుమ పండగ. ఈ కనుమ పండుగ జనవరి 16 మంగళ వారం రోజున వచ్చింది. ఆరోజు తిధి షష్టి తిధి . ఈరోజు ముఖ్యంగా రైతులు తమ పొలం పనులలో సహాయం చేసే పశువులను కడిగి అందంగా అలంకరించి పూజిస్తారు. మీరు కూడా ఇలా సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు జరుపుకొని భోగభాగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము..