Home » Devotional » Akhanda Dhana Yoga For This Zodiac Signs In 2025 With The Grace Of Shaniswar
Devotional

Shaniswar : శనీశ్వరుడి అనుగ్రహంతో 2025 లో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 28, 2024, 5:30 am
Advertisement

Shaniswar : జ్యోతిష శాస్త్రం ప్రకారం న్యాయదేవతగా శనీశ్వరుని భావిస్తారు. గ్రహాలలోనే శని ప్రత్యేకమైన గ్రహం. అయితే శనీశ్వరుడు మిగతా గ్రహాలు కంటే నెమ్మదిగా కదులుతాడు. అటువంటి శనీశ్వరుడు సమయాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే శనీశ్వరుడు సంచరిస్తున్న సమయంలో అన్ని రాశుల వారి పై ప్రభావం పడుతుంది.

Advertisement

Shaniswar : 2025వ సంవత్సరంలో దహన స్థితిలో కుంభ రాశి నుండి మీన రాశిలోకి శనీ..

2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీన రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే మార్చి 29వ తేదీన కుంభరాశి నుంచి మీన రాశిలో శని సంచరించబోతున్నాడు. అయితే దహన స్థితిలో ఉన్న శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించి మార్చి 31వ తేదీన ఉదయం 12:43 నిమిషాలకు ఉదయిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Shaniswar : శనీశ్వరుడి అనుగ్రహంతో 2025 లో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం…!

Advertisement

తులారాశి : శనీశ్వరుడు మీన రాశిలో సంచరించటం వలన తులా రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ఉద్యోగులకు మంచి ఫలితాలను పొందుతారు. ఇక శనీశ్వరుని దయ వలన తులా రాశి జాతకులకు 2025 వ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే కోర్టు కేసులలో ఈ రాశి వారికి అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఈ సమయంలో వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటక రాశి : మీన రాశిలో శనీశ్వరుడు సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఊహించని లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు దొరుకుతాయి. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను అందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిత ధనలాభం కలగడంతో ఆర్థికంగా మెరుగుపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

Advertisement

మీన రాశి : మీన రాశిలో శనీశ్వరుడు సంచరించడం వలన మీన రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే సహ ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేస్తున్నవారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా ఇది కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అలాగే కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మొత్తం మీద మీన రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి