Akshaya Tritiya : మన హిందూ సంస్కృతిలో ఎన్నో పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయి. అందునా మన తెలుగు సంవత్సరాల్లో ఎన్నో పట్టింపులు ఉంటాయి. ఒక్కో తెలుగు నెలలో ఒక్కో రకమైన పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అక్షయ తృతయ వచ్చేసింది. మే 10వ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ మొదలైంది. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే చాలా అదృష్టం అని అంతా అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బంగారం మాత్రమే కాకుండా ఈ 5 రకాల వస్తువులను కొన్నా సరే అదృష్టమే కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అక్షయ తృతీయ రోజు ఒక్క గ్రాము బంగారం, వెండి కొన్నా సరే ఎంతో అదృష్టం కలుగుతుందని అంటారు. ఆ రోజున బంగారం అంటే లక్ష్మీ దేవతతో సమానం. కాబట్టి బంగారాన్ని కొని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవతను మన ఇంట్లోకి ఆహ్వానించినట్టే. కాబట్టి బంగారం కొంచెం అయినా కొని లక్ష్మీ దేవి, కుభేరుడికి సమర్పించుకుంటే మంచిది.
అక్షయ తృతీయ రోజున బంగారంఒకటే కాకుండా కొత్త ఇల్లు కొన్నా సరే అంతా శుభమే కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు చాలా పవిత్రమైనది. కాబట్టి ఈ రోజున కొత్త ఇల్లు కొన్నా సరే లేదంటే ఇంకేదైనా చరాస్థి కొన్నా సరే మంచి జరుగుతుంది. కొత్త ఇల్లు నిర్మాణం ప్రారంభించుకున్నా సరే మంచి జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
అక్షయ తృతీయ రోజున కొత్త వాహనాలు కొన్నా సరే అదృష్టం కలుగుతుందని అంటున్నారు. అందులో చూసుకుంటే బైక్, కారు లాంటివి కొంటే ఇంకా మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఆటో మొబైల్ కంపెనీలు, అక్షయ తృతీయ రోజున బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కాబట్టి ఈ రోజున ఏ కొత్త వాహనం కొన్నా మంచి జరుగుతుంది.
అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కాదండోయ్.. వెండి కూడా ఎంతో అదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి వెండి వస్తువులు ఏది కొన్నా సరే ఇంట్లో లక్ష్మీ దేవి తాండవం చేస్తుందని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున మీ స్నేహితులు, ఇతర బంధువులకు వెండి వస్తువులను బహుమతిగా ఇస్తే ఇంకా శుభం కలుగుతుంది.
ధనవంతులు చాలా వరకు బంగారంతో పాటు వెండితో చేసిన మట్టి కుండలను అక్షయ తృతీయ రోజున ఎక్కువగా కొంటుంటారు. ఎందుకంటే మట్టికుండను కొంటే చాలా అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు. అక్షయ తృతీయకు మట్టికుండ కొంటే లక్ష్మీ దేవి ఆశిస్సులు లభిస్తాయని అంటారు. కాబట్టి మీరు కూడా బంగారం మాత్రమే కాకుండా ఈ ఐదు వస్తువుల్లో ఏదో ఒకటి కొనుగోలు చేయండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.