ఇంట్లో కలబందను ఈ ప్లేసులో పెడితే కనకవర్షమే..
Divotional : కలబంద లేదంటే అలొవేరా పేరు తెలియని వాళ్లు ఉండరు. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉన్న కలబందను మన ఆయుర్వేదంలో అనేక రకాల వైద్య చికిత్సలకు వాడుతుంటారు. చర్మ సంరక్షణకు, ఒంట్లో వేడిని తగ్గించడానికి కూడా కలబందను వాడుతుంటారు. దీనిని మన పెరట్లోనూ పెంచుకోవచ్చు. ఇల్లలో కుండీల్లో కూడా దీనిని పెంచుకోవచ్చు.ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలబందతో.. మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు వచ్చేలా కూడా చేయవచ్చు. ఇందుకు గాను కలబంద మొక్కను మన తలుపు/కడప వద్ద కడితే మంచి ఫలితాలు వస్తాయి.
అయితే దీనికి కొన్ని కండీషన్లు ఉన్నాయి. మరి కలబందను ఎలా కడితే ఇంటికి మంచి జరుగుతుంది, దానికి ఉన్న కండీషన్లు ఏంటో తెలుసుకోండి.అమావాస్య రోజున ఒక మొక్కను వేళ్లతో సహా తెచ్చుకొని శుభ్రంగా కడుగుకోవాలి. దానిని పూజ గదిలో దేవుడి పాదాల వద్ద ఉంచుకోవాలి. దానికి పసుపు, కుంకుమ, చందనంతో చక్కగా అలంకరించుకోవాలి. దానిని అగరబత్తి, సాంబ్రాణితో ధూపం వేసుకోవాలి. అమావాస్య రోజంతా దేవుడి గదిలో ఉంచిన కలబందను పాడ్యమి ఘడియలు మొదలైన తర్వాత ఇంటి గుమ్మానికి కుడివైపు కట్టాలి.
Divotional : ఆరోజు మారుస్తూ ఉండాలి
దీనిని ప్రతి నెల అంటే ప్రతి అమావాస్య తర్వాత మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంటిపై ఎవరిదైనా చెడు దృష్టి ఉన్నా దానిని తొలగిస్తుంది. ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దానిని తొలగిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. ఇక ఇలా కలబందను గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో కనక వర్షం కురుస్తుందట. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ మొక్కలను పెట్టుకునేందుకు సిద్ధం కండి. ఎందుకంటే ఇప్పటికే ఇది వాడిన చాలామంది ఈ పలితాన్ని అనుభవిస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు.