Categories: DevotionalNews

Ashada Masam : ఈ భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలంటే… ఆషాడ మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు… కారణం తెలుసా…?

Ashada Masam : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆషాడ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక ఆధ్యాత్మికమైన మాసంగా కూడా చెప్పవచ్చు. ఆషాడ మాసం జూన్ ఆసం నుండి జూలై మధ్య వరకు వస్తుంది. ఒక నెల రోజులు ఉంటుంది. ఆషాడ మాసం ప్రారంభంనికి కారణం వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. కా ఈ మాసంలో శుభకార్యాలను.. శూన్య మాసంగా పరిగణించడం జరిగింది. అందుకే శూన్యమాసం అంటారు కాబట్టి,శుభకార్యాలను తలపెట్టరు.. అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా,ఆరోగ్యపరంగా ఈ మాసం ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉంది. మరి అవేంటో తెలుసుకుందాం…
అయితే ఆషాడ మాసానికి హిందూ ధర్మంలో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత విశిష్టత ఉన్నప్పటికీ, కొన్ని పనులకు ఇది అనుకూలమైన సమయం కాదని, పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నాయి. దీని వెనుక పౌరాణిక,జ్యోతిష్య, ఆరోగ్యపరమైన కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మాసంలో తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఆషాడ మాసం ప్రారంభంలోనే తొలి చినుకులు జల్లు అంటే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. లేదంటే, అనారోగ్య సమస్యలు తప్పవు. ఆషాడ మాసం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం…

Ashada Masam : ఈ భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలంటే… ఆషాడ మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు… కారణం తెలుసా…?

Ashada Masam ఆషాడ మాసంలో చెయ్యకూడని పనులు

వివాహాలు,గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు : ఆషాడ మాసాన్ని శూన్య మాసంగా పరిగణిస్తారు.కాబట్టి,ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరపరాదు. శూన్య మాసం అంటే అంతా శూన్యం కాబట్టి మంచి రోజులుగా దీనిని పరిగణలోకి తీసుకోరు. ఈ రోజుల్లో ఏది చేసినా చెడు జరుగుతుంది అని నమ్మకం. వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు ఏమి చేయకూడదు.

పౌరాణిక కారణం : ఆషాడ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి )నాడు,శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడని నమ్మకం. విష్ణువు నిద్రలోకి వెళ్లడం వల్ల ఈ నాలుగు నెలలు చాతుర్మాసంలో శుభకార్యాలకు ఆయన ఆశీస్సులు లభించమని భావిస్తారు.

ఆరోగ్యపరమైన,సామాజిక కారణం : పూర్వకాలంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు,బహిరంగ ప్రదేశాలలో పెద్ద పందిళ్ళ కింద నిర్వహించేవారు.ఆషాడమాసం వర్షాకాలం ప్రారంభం కాబట్టి, వర్షాలు,గాలులు వల్ల కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయని.అలాగే, వర్షా కాలంలో వాతావరణ మార్పులు వల్ల అతిధులు అనారోగ్యానికి గురై అవకాశాలు కూడా,ఉంటాయని భావిస్తారు.ఆహారం కలుషితమయ్యే అవకాశం కూడా ఉండవచ్చు.హోమాలు నిర్వహించడానికి కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తారు.

నూతన వధూవరువులు కలవకూడదు : కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ మాసంలో దూరంగా ఉండడం, వధువును పుట్టింటికి పంపించడం ఆనవాయితీగా వస్తుంది.

ఆరోగ్యపరమైన కారణం : కొత్తగా పెళ్లయిన వారు ఆషాడ మాసంలో గర్భం దాల్చితే, వేసవికాలంలో ఎండాకాలంలో ప్రసవం అవుతుంది. ఆ సమయంలో తల్లికి బిడ్డకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని,పూర్వీకులు నమ్మేవారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శిశువుకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నియమం పాటించేవారు.

మాంసాహారం మద్యం సేవించడం : ఈ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.కాబట్టి, మాంసాహారాన్ని మధ్యాన్ని సేవించకూడదు.

తీర్థయాత్రలు : చాతుర్మాసంలో సాధువులు, సన్యాసు లు ఒకే చోట స్థిరనివాసంగా ఏర్పరచుకుంటారు.

ప్రాక్టికల్ కారణం : వర్షా కాలంలో ప్రయాణాలు చాలా కష్టంగా ఉంటాయి. నదులు, కాలువలు, పొంగిపొల్లడం, రోడ్లు మీద పారడం వంటివి జరుగుతాయి.అందుకే, దూర ప్రయాణాలకు,తీర్థయాత్రలకు ఈ మాసంలో నిర్ణయం తీసుకోకపోవడం మంచిది.ఇంటి వద్దనే ఉండి పూజలు, జపాలు చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది.

కొత్త వ్యాపారాలు ప్రారంభించడం : జ్యోతిష్య నమ్మకాల ప్రకారం.. ఆషాడ మాసంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి,కొత్త వ్యాపారాలు లేదా ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదని భావిస్తారు.కాబట్టి, దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఆషాడ మాసంలో చేయాల్సినవి : ఈ మాసంలో కొన్ని శుభకార్యాలకు అనుకూలం కాకపోయినా, ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో విష్ణు, శివుని,అమ్మవార్లను పూజిస్తే, వ్రతాలు ఆచరిస్తే,దానధర్మాలు చేస్తే, ఇలాంటి శ్రేష్టమైనవి చేస్తే,ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇంకా బోనాలు, గురుపూర్ణిమ వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. బోనాల పండుగ చేయడం వల్ల ఈ వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధుల నుంచి మనల్ని అమ్మవారు కాపాడాలని భక్తిశ్రద్ధలతో ఆమెకు బోనాలను సమర్పిస్తారు.

గోరింటాకు ఈ ఆషాడంలో బాగా పండుతుంది అనే నమ్మకం : ఆషాడ మాసంలో స్త్రీలు గోరింటాకును ఎక్కువగా పెట్టుకుంటారు.ఈ మాసంలో గోరింటాకు ఎక్కువగా పండుతుందని. కొందరైతే మహిళలకు సౌభాగ్యం కలుగుతుందని,ఆధ్యాత్మిక విశ్వాసం. గోరింటాకు ఎర్రగా పండుటకు కారణం, వర్షాకాలంలో గోరింటాకుకి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కావున గోరింటాకు ఎర్రగా పండుతుంది. మిగతా కాలాలలో, గోరింటాకులో అంత నీటి శాతం ఉండదు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago