Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..?

Ashada Masam Pooja : ఆషాడ మాసంలో శుభకార్యాలను నివారించడం జరిగింది. కానీ గ్రామదేవతలైన అమ్మవార్లకి ఇంకా శక్తి స్వరూపుణిలైన లేదా ఉగ్రదేవతలైన, దుర్గాదేవి,కాళికామ్మ, కాలభైరవులను పూజిస్తే, జాతక దోషాల నుండి విముక్తిని పొందవచ్చు .పండితులు తెలియజేస్తున్నారు. ఆషాడ మాసంలో ఈ అమ్మవారిలకి పూజ చేస్తే,ఆరోగ్య ప్రాప్తి పొందవచ్చు. ఇంకా, దేని చేతనైనా పీడితులైతే దాని నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఈ మాసంలో ఎలా పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు తెలుసుకుదాం…

Ashada Masam Pooja ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి ఎలాంటి దానాలు చేయాలో తెలుసా

Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి.. ఎలాంటి దానాలు చేయాలో తెలుసా..?

Ashada Masam Pooja ఆషాడ మాసంలో ఏ అమ్మవారిని పూజించాలి

ఆషాడ మాసం అనేది హిందూ క్యాలెండర్లలో ఒక ముఖ్యమైన మాంసం. ఈ మాసం సాధారణంగా శుభకార్యాలకు అనుకూలం కాదని నమ్ముతారు. అయితే,ఈ కాలంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు, దానాలు చేస్తే చాలా అదృష్టం తో పాటు ఆరోగ్యం,శుభాలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా భక్తుల నమ్మకం కూడా.
ఉగ్రదేవతలైన దుర్గాదేవి, కాళికమ్మ, మహిషాసుర మర్దిని, కాలభైరవులను ఆషాడ మాసంలో పూజిస్తే,చాలా శుభప్రదం పండితులు పేర్కొంటున్నారు. ఈ దేవతల పూజ జాతకంలోని పాప గ్రహ దోషాలను తొలగించి, గ్రహాల అనుగ్రహాన్ని పొందెందుకు సహకరిస్తుంది.

Ashada Masam Pooja : ఆషాడ మాసంలో ఏ దేవతలకి పూజ చేయాలి

ఆషాడ మాసంలో దుర్గాదేవి ఆలయంలో, మంగళవారాలు, శుక్రవారాలలో,రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల,కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం కోసం కాళికా అమ్మకు నిమ్మకాయల దండ సమర్పించాలి. శత్రు బాధలు, నరదిష్టి నుండి రక్షణ లభిస్తుంది. కాలభైరవుని దర్శించుకోవడం, అభిషేకం చేయించుకోవడం, దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వివరించారు.

Ashada Masam Pooja ఆషాడ మాసంలో ఎలాంటి దానాలు చేయాలి

ఆషాడ మాసంలో ఇలాంటి దానాలు చేస్తే అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు, ఉసిరికాయ దానం చేస్తే జాతక దోషాల తీవ్రత తగ్గుతుంది.ఏ దానం చేయకపోయినా, ఉప్పు దానం కూడా శుభప్రదం అని తెలిపారు. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలో సమర్జన చేయడం, సేవ చేయడం, చెట్లను నాటడం, చెట్లకు నీరు పోయడం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయి.
గ్రామదేవతలకు పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి.పసుపు బోట్లు అలంకరించాలి. నిమ్మకాయల దండలు సమర్పించాలి. పెరుగన్న నైవేద్యాన్ని సమర్పించాలి. ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతే కాదు,వరాహి అమ్మవారికి పూజలు చేయడం, వరాహి కంద దీపం వెలిగించడం కూడా అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది.సంక్షిప్తంగా, ఆషాడమాసంలో ఈ పూజలు దానాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది