Makara rasi : మకర రాశి ఉద్యోగి లక్షణాలు ఎలా ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో వారి యొక్క నైపుణ్యాలు ప్రతిభ పటవాలు ఎలా ఉంటాయి..? అదేవిధంగా మకర రాశి ఉద్యోగి ఏ ఏ రంగాలలో రాణిస్తారు…? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.మకర రాశి ఉద్యోగికి పని పట్ల అంకితభావం గౌరవం ఉంటాయి. వీరు పనిని ఎంతో నీతి నిజాయితీగా క్రమ పద్ధతిగా చేస్తారు. వీరు తమ పనిని దైవంగా భావిస్తారు. అంతటి గౌరవ మర్యాదలు వీరికి పని పట్ల ఉంటాయి. చిన్ననాటి నుండే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి పని విలువ డబ్బు విలువ శ్రమ విలువ బాగా తెలుసు. అయితే వీరు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత తలవంచుకుని వారి పని వారు చేసుకుని వెళ్ళిపోతారు.
అంతేగాని 10 మందితో కాలక్షేమం చేయాలని గాని సమయాన్ని వృధా చేసుకోవాలని అసలు అనుకోరు. వీరికి సమయం వృధా చేయడం అన్న నిర్లక్ష్యం చేయడం అన్న అసలు నచ్చదు. అలాగే ఈ రాశి వారు ఇతరుల మీద ఆధారపడరు. తన పనిని తానే కష్టపడి పనిచేసే శ్రమను నమ్ముకుంటారు. అంతేగాని పక్కవారి సహాయాన్ని తీసుకోరు. అదేవిధంగా పక్కవారు వీరిని సహాయం అడిగితే అందులో ముందుంటారు. వీరికి చేతనైన సహాయం వారికి చేస్తారు. వీరు చేస్తున్న రంగంలో ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటారు. వీరికి జీవితంలో ఎన్నో ఆటంకాలు ఓడిదుడుకులు ఉన్న వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు. చివరికి తన లక్ష్యాన్ని చేరుకుంటారు. వీరు తన పై అధికారి మాటలను తప్పకుండా పాటిస్తారు. అయితే వీరి దృష్టి అంత ఉద్యోగం పై మెట్టు మీదనే ఉంటుంది. అధికారం సాధించాలి అనేది వీరి అంతిమ లక్ష్యం. అలాగే ఈ రాశి వారికి డబ్బు విలువ కూడా బాగా తెలుసు. వీరికి అదనపు పని అప్పజెప్పిన ఏమాత్రం బాధపడరు.కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకొని నలుగురు చేసే పనిని ఒక్కరే చేసి చూపిస్తారు.కానీ వీరు పైకి చూడడానికి అలా కనిపించరు.కాస్త అమాయకంగా ఉంటారు కానీ వీరికి పని అప్పగిస్తే వారి ప్రతిభ పాటవాలు బయటికివస్తాయి.వీరు వృత్తి ఉద్యోగాల పట్ల ఎంతో నిజాయితీగా ఉంటారు.వీరిలో శ్రమ గుణం ఎక్కువగా ఉంటుంది.
వీరి అనుకున్నది సాధించడం కోసం ఎంతకాలమైనా వేచి చూస్తారు.ఆ సమయంలో ఎంతో కష్టపడతారు. చివరికి వీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు.ఈ రాశి వారికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీరికింది స్థాయి ఉద్యోగులు ఏదైనా తప్పు చేస్తే వాటిని క్షమిస్తారు.ఇక మకర రాశి వారు ఏ రంగాలలో రాణిస్తారు అంటే వీరు ఎక్కువగా బ్యాంకు రంగాలలో రాణించగలుగుతారు. లాయర్లుగా ఉపాధ్యాయులుగా, పుస్తక విక్రయతులుగా లైబ్రేరియన్ గా వీరు తమ ప్రతిభ పాటవాలను కొనసాగిస్తారు.అలాగే వీరు మంచిదంత వైద్యులుగా రాణిస్తారు.డాక్టర్ లాయర్ ఇంజనీరింగ్ వంటి రంగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది.పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది.
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్లోని కంటెస్టెంట్స్ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
RBI : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు.…
Coconut Oil : కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అని అంటారు. ఎందుకు అంటే ఈ చెట్టు నుండి దొరికే అన్ని…
Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం…
This website uses cookies.