Nagababu : మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా సత్తా చాటిన విషయం తెలిసిందే. టీవీ షోలు చేసారు. జడ్జిగా కూడా ఆయన రాణించారు. కానీ గత కొన్నాళ్లుగా పూర్తిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు. నాగబాబు గతంలోనే పలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, కామెడీ షోలు చేసారు.
అయితే తాజాగా N మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నాను అని ప్రకటించారు. N మీడియా లోగో రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి N మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించారు.N మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను కొనేశారు. రెండు రోజుల క్రితం ఈ ఛానల్‌కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. ఈ ఛానల్‌కు ప్రస్తుతం 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమవుతారని, భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ కూడా ఉంటుందని తెలుస్తోంది. నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతానికి N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాత్రమే కంటెంట్ ఇవ్వనున్నారు. అయితే భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్ సైట్ కూడా స్థాపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటినుంచి N మీడియాని స్థాపించి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు జనసేనకు సపోర్ట్ గా ఉండేలా చూసుకుంటారేమో అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం యూట్యూబ్ ఛానల్, వెబ్ సైట్ తో ఆగుతారా శాటిలైట్ ఛానల్ కూడా పెడతారా, జనసేనకు N మీడియా కలిసొస్తుందా అని టాలీవుడ్ లో చర్చగా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.