Home » Devotional » Astrology Of Tula Rasi August 2024 2
Devotional

Tula Rasi : ఆగస్టు నెలలో తులారాశి వారికి పట్టనున్న అదృష్టం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 29, 2024 9:37 pm
Advertisement

Tula Rasi  : ఆగస్టు నెలలో తుల రాశి వారికి ఎలా ఉంటుంది…? అలాగే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది..? వీరు చేయవలసిన పరిహారాలు ఏంటి…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం  .. ఆగస్టు నెలలో తులా రాశి వారికి రవి బుధ శుక్ర రాహువు సంచారం వలన అనుకూలమైన సమయాలు గోచరిస్తున్నాయి. ప్రతి అవకాశం కూడా అంది వస్తుంది. గతంలో చేసిన అన్ని ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు ప్రయత్నాలు సఫలమవుతాయి. జాతకరీత్యా కొన్ని గ్రహాలు వీరిని ఇబ్బంది పెడితే గనుక దానికి వీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. లేదా గోచారం రిత్య తృప్తికరమైన జీవనాన్ని వీరు పొందగలుగుతారు. ఏకాగ్రత పెడితే విజయాలను తప్పకుండా సాధిస్తారు. వివాహం మరియు ఇతర శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం కోసం విదేశాల్లో ఉన్నటువంటి వారు తాపత్రయపడతారు. కుమారుడి విషయంలో కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఆనందదాయకంగా చేస్తాయి. ధనాన్ని ఎవరికి పడితే వారికి అప్పుగా ఇచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భూ గృహ విషయాలలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు.

Advertisement

తులారాశి వారు ఆగస్టు మాసంలో వీరికి ఇష్టమైన వారి పేరు మీద కొన్ని ఖరీదైన వస్తువులు కొనవచ్చు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి. గ్రహాల అనుగ్రహం తుల రాశి వారిపై పుష్కలంగా ఉన్నది. అదేవిధంగా విద్యార్థులు ఉన్నత విద్య చదివే మార్గాలను వెతుకుతూ ఉంటారు. విద్యార్థులకు గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. అలాగే తులా రాశిలో కొంతమంది స్త్రీలు కష్టంలో ఉన్నటువంటి వారికి ధన రూప సహాయం కంటే కూడా వస్తు రూప సహాయం చేస్తారు. ఈ మాసంలో అమావాస్య తర్వాత నష్టపోతాం ఏమో అని వీరు అనుకుంటారు తప్ప ఎక్కడ నష్టపోరు అలాగే ఎటువంటి మోసలు జరగవు. అయినప్పటికీ బంధుమిత్రులు ఆప్తులు కుటుంబ సభ్యులు ఆదర్శిస్తూ ఉంటారు. తొందరపడి మాట ఇవ్వకూడదు. అలాగే మాట జారకూడదు. జాగ్రత్తగా ఉండడమే ఈ యొక్క మాసంలో తులారాశి వారు తీసుకోవాల్సిన ప్రధానమైన నిర్ణయం.

Tula Rasi : ఆగస్టు నెలలో తులారాశి వారికి పట్టనున్న అదృష్టం…!

Advertisement

Tula Rasi  పరిహారాలు

కుదిరితే తులా రాశి జాతకులు వెండిని దానం చేయండి. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. గృహం కూడా ప్రశాంతంగా ఉంటుంది. దీనిని గణపతికి ఇవ్వడం ద్వారా వీరికి ఉన్నటువంటి నిగ్రహాలన్నీ తొలగిపోతాయి. గణపతిని ఆరాధన చేయడం మంచిది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి