పిల్లలకు పేరు పెడుతున్నారా.. ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక మనిషి తల్లి గర్భంలో పడినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అయితే బిడ్డ పుట్టిన తర్వాత పురుడు, బారసాల, పుట్టు వెంట్రుకలు తీయడం… ఇలా ఒక్కటేమిటో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. అయితే ఈ క్రమంలోనే మన పిల్లల బారసాల రోజు నామకరణం చేస్తుంటాం. అయితే ఈ నామకర మహోత్సవానికి హిందువులు మరింత ప్రాధాన్యతను ఇస్తారు. ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలకు వైవిధ్యమైన పేరును అలాగే మంచి అర్థవంతమైన పేరును పెట్టాలని ఆశిస్తారు. ఈ పేరు పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే చాలా మంది తమ పిల్లలకు పేర్లు పెట్టాలంటే మంచి జ్యోతిష్యుని సలహా తీసుకుంటారు.
పిల్లలకు పేరు పెట్టే నామకరణ కార్యక్రమం ఎందుకు ముఖ్యమో, పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం పండుగ, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి రోజున పిల్లలకు పేర్లు పెట్టకూడదని శాస్త్రాలు ఉన్నట్లు పండితులు చెబుతారు. ఇది కాకుండా తిథి, చతుర్థి, నవమి, చతుర్దశి తేదీలలో నామకరణం చేయడం మంచిది కాదని ఆధ్యాత్మిక గ్రంథాల్లో శాస్త్రాల్లో ఉందని పండితులు గట్టిగా హెచ్చరిస్తుంటారు. చంద్రుడు, బుధుడు, గురు, శుక్రుడు వంటి శుభ గ్రహాలకు సంబంధించి నామ కరణం చేయవచ్చు. బిడ్డ పుట్టిన 11వ లేదా 12వ రోజున పేరు పెట్టడం శుభ ప్రదంగా పరిగణిస్తారు. లేదా పిల్ల వానికి బారసాలా నిర్వహించే రోజున పేరు పెట్టడం అత్యంత శ్రేయస్కరమని చెబుతారు
పండిత నిపుణులు.దేవుళ్ల పేర్లు లేదా దేవుళ్ల నామాలు పేరులో వచ్చే విధంగా ఉంటే శుభప్రదమని చాలా మంది అనుకుంటారు. రాశుల దశను బట్టి, వచ్చిన అక్షరాన్ని బట్టి పిల్ల వానికి పేరు పెట్టవచ్చు. 2, 4 లేదా 6 అక్షరాల ప్రాక్టికల్ పేరు ఉత్తమంగా పరిగణిస్తారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. అదే సమయంలో కీర్తి, ప్రతిష్టలను కోరుకునే వ్యక్తి పేరు రెండు అక్షరాలతో ఉండాలని చాలా శాస్త్రాలు చెబుతున్నాయి. అదే సమయంలో బ్రహ్మ చర్యానికి, తపస్సుకు నాలుగు అక్షరాల పేరు ఉత్తమం. అబ్బాయిల పేర్లను 3, 5, 7 అనే బేసి అక్షరాలతో పెట్టకూడదని సంఖ్యా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆడపిల్ల పేరులో బేసి అక్షరాలు 3, 5 అక్షరాలు ఉంటే శుభ ప్రదంగా భావిస్తారు.