Home » Devotional » Before Death Symptoms In Telugu
Devotional

Before Death : మరణానికి వారం రోజులు ముందు ప్రతి మనిషికి వచ్చే సూచనలు ఇవే…!

Authored By
aruna
The Telugu News | Published on: February 23, 2024, 2:00 pm
Advertisement

Before Death : ఈ భూమ్మీద కి వచ్చిన ప్రతి జీవి ఆయుర్దాయం తీరగానే మరణించక తప్పదు. ఇది తద్యం. కాకపోతే ఆ జీవుడు చేసిన కర్మలను అనుసరించి చావు అనేది కొంచెం ముందు వెనక ఉంటుంది అంతే. మరి అంత భయంకరమైన చావు గురించి శివపురాణంలో ఏమని చెప్పబడింది. మరణం సంభవించే ముందు జీవునికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి. తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ తెలుసుకుందాం. ఒకనాడు కైలాసంలో శివపార్వతుల ఇరువురు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివునితో స్వామి ఈ లోకంలో కడు దుర్భరమైంది చావు. మానవులు దీని నుంచి తప్పించుకోడానికి చాలా ప్రయాస పడుతుంటారు. ప్రళయంలో సంభవించే మరణానికి ముందు మరణానికి చేరువవుతున్న జీవికి ఏమైనా సంకేతాలు కనిపిస్తాయి అని అడుగుతుంది.

Advertisement

అప్పుడు పరమశివుడు పార్వతి దేవికి మరణం సంభవించే ముందు జరిగే సూచనలను గురించి ఈ విధంగా వివరించాడు. మరణించబోయే ముందు జీవుడు కంటికి ఈ ప్రకృతి అంతా బంగారు వర్ణంలో మెరుస్తూ ఆత్మను తనను లీనం చేసుకోవడానికి ఆహ్వానిస్తూ ఉంటుంది. జీవుడు పక్షం రోజుల్లో దేహం విడుస్తాడనిగా తన పితృదేవతలంతా పదేపదే స్వప్నంలో కనిపిస్తూ తమతో రమ్మని పిలుస్తూ ఉంటారు. ఎంత ఇష్టమైన ఆహార పదార్ధమైన వికారంగా కనిపిస్తుంది. నాలుక ఉబ్బుతుంది. పంటి చిగుళ్ళకు చీము పడుతుంది. తన ప్రతిబింబాన్ని అద్దంలో గాని నూనెలో కానీ తాను స్పష్టంగా చూసుకోలేదు. ఆఖరికి తన నీడ కూడా తల లేని మొండ్యంలా కనిపిస్తుంది. శరీరం క్రమంగా పసుపు వర్ణంలోకి మారిపోతుంది.

కొంచెం కొంచెంగా మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. శరీరం గాలి లో తేలిపోతున్నట్లు ఉండి పైనుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశంలో ప్రకాశమంతంగా మెరిసే దృవ నక్షత్రం కూడా కంటికి కనిపించకుండా మాయమవుతుంది. ఆలోచన శక్తి నశించి విచక్షణా జ్ఞానం కోల్పోయి పదే పదే పరాకు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక జీవుడు అదే రోజున దేహం విడుస్తాడని గా పిట్ట ఇంటి పైనుంచి కూస్తూ వెళుతూ ఉంటుంది. కుక్కలు పదే పదే తలకిందుకూ మంచి ఏడుస్తూ అటు ఇటు తిరుగుతుంటాయి. కాకులు కీకర శబ్దం చేసుకుంటూ అరుస్తూ ఉంటాయి. ఇలా మృత్యు ముంచుకొస్తున్న సమయంలో జీవుడు రెండు కళ్ళ మధ్యలో నుండి ఒక కాంతి వలయం బయటకు వస్తుంది. ఆ మహా కాంతి వలయం నుండి వచ్చి అదృష్టమాత్రమైన ఆత్మను యమపాశంతో ప్రకటించి ఒక భరణలో ఉంచుకొని యమలోకానికి పైనం అవుతారు. ఇలా జీవుడు మరణించే ముందు అతనికి అనేక సంకేతాలు కనిపిస్తాయని పార్వతీదేవికి శివుడు వివరించాడు..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి