Chaitra Navratri 2023 : ఈ అమ్మవారిని ఏ రంగుల దుస్తులతో పూజిస్తే అనుగ్రహం కలుగుతుంది.? ఈ రంగుతో అంతా శుభమేనా..?
Chaitra Navratri 2023 : హిందూ సాంప్రదాయాలలో మహిళల పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులను ఎంతో పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు.అయితే చైత్ర మాస తిథి మార్చి 21వ తేదీ రాత్రి 10 గంటల 52 నిమిషాలకు ప్రారంభమై మార్చి 22వ తేదీ రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. చైత్ర నవరాత్రి అంటే హిందూ ధర్మం ప్రకారం కొత్త సంవత్సరానికి నాందిగా అందరూ భావిస్తూ ఉంటారు. చైత్ర నవరాత్రులలో ప్రజలు దుర్గామాతను ఆరాధిస్తూ ఉంటారు. ఈ తొమ్మిది రోజులపాటు కొన్ని రకాల దేవతలను ఆరాధిస్తారు. ఈ పూజలలో వస్త్రానికి దాని ప్రాముఖ్యత ఉంటుంది.
వాస్తవానికి సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ దేవతను ఆరాధించడం చాలా మంచిదని నమ్ముతుంటారు. ఏ రంగు దుస్తులు ధరించి పూజిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయో జ్యోతిష్యుడు పండిట్ కన్నయ్య లాల్ మిశ్రా తెలుపుతున్నారు. మాత శైలి పుత్రుని నవరాత్రులలో మొదటి రోజు ఆరాధిస్తారు. ఆనాడు పసుపు రంగు దుస్తులను ధరించడం వలన మంచి ఫలితాలు పొందుతారట. మరునాడు బ్రహ్మచారి నీ మాతను ఆరాధిస్తారు. ఆనాడు ఆకుపచ్చని దుస్తులు ధరించి అమ్మవారిని పూజించాలి. మూడవ నాడు చంద్ర గంట మాతను ఆరాధిస్తారు. ఆనాడు గోధుమ రంగు దుస్తులు ధరించడం అంత శుభమే జరుగుతుందట.
నాల్గవ నాడు మాత కుసుమాండను ఆరాధిస్తారు. ఆనాడు తల్లి నారింజ రంగు దుస్తులు ధరిస్తే సుఖ సంతోషాలతో ఉంటారు.
ఇక ఐదో నాడు చంద్రమాత అమ్మవారిని ఆరాధిస్తారు. ఆనాడు తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.. ఆరోవనాడు కాత్యాయని అమ్మవారిని ఆరాధిస్తారు. ఆనాడు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. వాటితో పాటు తల్లికి ఎరుపు రంగు మేకప్ వెయ్యాలి. ఇక ఏడవ నాడు కాలరాత్రి అమ్మవారిని ఆరాధిస్తారు. ఆనాడు నీలి రంగు దుస్తులు ధరించడం వలన ఆ తల్లి సంతోషిస్తుందట. 8వ రోజున మాట మహాగౌరీని ఆరాధిస్తారు. ఆనాడు బుక్క కలర్ దుస్తులను ధరించడం మంచిది. ఇక తొమ్మిదవ రోజు చివరి రోజు మాత సిద్ధి దాత్రిని ఆరాధిస్తారు. ఆనాడు తల్లి ఉదా రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే తల్లి సుఖసంతోషాలను, అష్ట ఐశ్వర్యాలను కోరుకున్న కోరికలను నెరవేరుస్తుందట ఆ తల్లి కటాక్షకం పొందవచ్చట.