Diwali | దీపావళి 2025: పండుగ రోజు ఇవి కనిపిస్తే శుభఫలితాలే.. జ్యోతిష శాస్త్రంలో విశేష ప్రాధాన్యం కలిగిన సంకేతాలు
Diwali | ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య తిధిని హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో దీపావళిగా జరుపుకుంటారు. దీపాల పండుగగా ప్రసిద్ధి చెందిన దీపావళి పర్వదినం ఈ సంవత్సరం అక్టోబర్ 20, సోమవారం రోజున వచ్చింది. ఈ రోజు లక్ష్మీదేవి పూజకు ప్రత్యేకమైన శుభముహూర్తంగా భావిస్తారు. సంపద, శాంతి, సుఖసౌభాగ్యాలు వృద్ధిచెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలు లక్ష్మీదేవి, గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
#image_title
ఈ ప్రత్యేక దినాన కొందరు జీవులు లేదా వస్తువులు కనిపించడం వల్ల శుభఫలితాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అటువంటి శుభ సూచకాలను ఇప్పుడు పరిశీలిద్దాం:
1. గుడ్లగూబను చూసినట్లయితే – లక్ష్మీ కటాక్షం
పురాణాల ప్రకారం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. దీపావళి రోజు గుడ్లగూబను చూసినవారికి ఆర్థిక అభివృద్ధి జరగనుందని, భవిష్యత్తులో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. ఇది అత్యంత శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
2. కమలం పువ్వు – సంపదకు సంకేతం
లక్ష్మీదేవి చేతిలో కమలం పుష్పం ఉండటం పర్యాయపదంగా సంపదను సూచిస్తుంది. దీపావళి రోజున కమలం పువ్వు కనిపిస్తే ధన లాభాలు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుదల వంటి శుభ సూచనలుగా తీసుకుంటారు.
3. కాకి దర్శనం – పితృదేవతల ఆశీర్వాదం
దీపావళి పర్వదినాన కాకి కనిపించడం లేదా ఇంటి ప్రాంగణంలోకి రావడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. జ్యోతిషశాస్త్రం ప్రకారం కాకి పితృదేవతల చిహ్నంగా భావించబడుతుంది.
4. ఆవులు, బల్లులు, హిజ్రాల దర్శనం – శుభ సమయానికి సంకేతం
ఆవులు పవిత్రతకు ప్రతీకలు కాగా, బల్లులు కొన్ని సంప్రదాయాల్లో శుభ సూచకాలుగా పరిగణించబడతాయి. అలాగే హిజ్రాల దర్శనం కూడా కొన్ని ప్రాంతాల్లో శుభంగా భావిస్తారు.