Chanakya Niti: ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. చాణక్య తెలిపిన జీవన విధానాలను అవలంబించడం ద్వారా ఎవరైనాసరే తమ జీవితాన్ని సరళంగా, తేలికగా మార్చుకోగలుగుతారని చెప్పాడు. అందుకే చాణక్య అందించిన నీతి సూత్రాలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. చాణక్య తెలిపిన విధానాలు కొంతవరకూ కఠినంగా అనిపించినప్పటికీ, వీటిని జీవితంలో అమలుచేస్తే, సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు.జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలో ఆచార్య చాణక్య తెలియజేశారు. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు ప్రతికూల పరిస్థితులలోనూ విజయం సాధిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తులు ఎంతో అంకితభావంతో పనిచేస్తూ, తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని వివరించారు.
ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతిలో వ్యక్తికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతంగా జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. చాణక్య నీతిలో ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగితే జీవితంలో సులభంగా మోసపోలేరని చెప్పాడు.మనం ఒకరి గురించి చాలా త్వరగా అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటాము. అయితే వ్యక్తి యోగ్యతలు, లోపాలు బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. కనుక అతనితో కొంత సమయం ఓపికగా గడపండి. అతని ప్రవర్తనను గమనించండి. అంతేకాదు ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. ఇతరులతో వ్యవహరించే విషయంలో అతని నిజమైన స్వభావం బయటపడుతుంది.ఒక వ్యక్తిలో త్యాగ స్ఫూర్తి ఎంత ఉందో చూడటం చాలా ముఖ్యం. త్యాగం చేసే గుణం ఉన్నవారు ఇతరుల బాధలను అర్థం చేసుకుని సహాయం చేస్తారు.
మరోవైపు, త్యాగం చేయడం తెలియని వారు స్వార్థపరులు. అంతేకాదు తాము అనుకున్నది పొందడానికి ఏదైనా చేస్తారు.క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆచార్య చెప్పారు. విజయం సాధించాలనుకుంటే ప్రతి ఒక్క నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ లేకుంటే జీవితంలో విజయం సాధించడం అసాధ్యమన్నారు.వ్యక్తి స్వభావాన్ని, అతని పనితీరుని బట్టి అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తే, అతని స్వభావంలో మోసపూరితమైన నేచర్ ఖచ్చితంగా ఉంటుంది. అతని నుంచి దయ, నిజాయితీని ఆశించడం సమయం వృథా. సంస్కారం ఉన్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కొన్ని సూత్రాలు ఉంటాయి. అతను ఎప్పుడూ తప్పు చేయడు. కానీ సంస్కారం లేని వ్యక్తిపై ఆశలు పెట్టుకోవడం మానుకోవాలి.
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
This website uses cookies.