Chanakya Niti : ఈ చెడు అలవాట్లను మానుకోండి.. జీవితంలో ఎదగండి..!
Chanakya Niti : జీవితం అన్న తర్వాత ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరు అదేపనిగా గేమ్స్ ఆడతారు.. కొందరు సినిమాలు చూస్తారు.. కొందరు పనిలో నిమగ్నం అవుతారు.. మరికొందరు చాటింగ్ చేస్తూ ఉంటారు. కానీ మనిషి తన జీవితంలో కొన్ని అలవాట్లను మానుకోవాలని.. లేకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుందని నీతి శాస్త్రంలో చాణుక్యుడు బోధించాడు. ఆయా అలవాట్లను మానుకుంటే మనిషి జీవితంలో విజయాలు సాధించవచ్చని ఆయన సూచించాడు.ప్రతి వ్యక్తికి జీవితంలో స్నేహితులు ముఖ్యమే.. కానీ స్నేహితులు మంచి వాళ్లు ఉంటారు. అలాగే చెడ్డవాళ్లు కూడా ఉంటారు. చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం. అయితే కొంతమంది వాళ్లను క్షమించేస్తూ ఉంటారు.
తప్పుడు సహవాసం విడిచిపెట్టకపోతే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణుక్యుడు హెచ్చరించాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మనిషి చెడు అలవాట్ల వైపు మళ్లుతాడని తద్వారా జీవితం నాశనం కాక తప్పదని హితవు పలికాడు.అటు మనిషి సోమరితనంగా ఉండటం కూడా చెడ్డ అలవాటే. చాలా మంది సోమరితనంతో పనులు చేయడానికి బద్ధకం చూపుతారు. ఆ సోమరితనమే భవిష్యత్‌లో వాళ్లకు శత్రువుగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. సోమరితనం వల్ల వాటిని మిస్ చేసుకుంటే జీవితంలో అంధకారమే మిగులుతుంది.
కీడు ఎంచి మేలు ఎంచమని కొన్ని సామెతల్లో చెప్తుంటారు. కానీ కొందరు అదేపనిగా ప్రతికూలంగా ఆలోచిస్తుంటారు. నెగిటివ్ థింకింగ్ అనేది మన మానసిక పరిస్థితి అద్దం పడుతుంది. ఇది కూడా చెడు అలవాట్లలో ఒకటి. ప్రతికూల ఆలోచనలు చేసే వాళ్లు జీవితంలో ఎదగలేరు. వాళ్లు చేపట్టే పనిలో విజయం సాధించలేరు. సానుకూలంగా వ్యవహరించడం అనేది జీవితంలో విజయాన్ని చేకూరుస్తుంది. అందుకే పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనిషి చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమాజంలో గౌరవంగా బతికితే జీవితం పరిపూర్ణంగా మారుతుందని చెప్తున్నారు.