Karthika Deepam 2 March 10th 2026 Today Episode : దీపను చంపేస్తానంటూ జ్యోత్స్న వార్నింగ్.. నిజం తెలిసి రగిలిపోయిన దశరథ్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 2 March 10th 2026 Today Episode : దీపను చంపేస్తానంటూ జ్యోత్స్న వార్నింగ్.. నిజం తెలిసి రగిలిపోయిన దశరథ్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 March 2026,8:30 am

Karthika Deepam 2 March 10th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. దీప గర్భవతి అన్న నిజం తెలియడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా మార్చి 10వ తేదీ ఎపిసోడ్‌ March 10th Episode లో ఎమోషన్స్, సస్పెన్స్, వార్నింగ్‌లతో సీరియల్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లింది. దీపను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని జ్యోత్స్న వేస్తున్న ప్లాన్స్, ఆమె కిరాతక బుద్ధి తెలిసి దశరథ్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో వివరంగా తెలుసుకుందాం.

Karthika Deepam 2 March 10th 2026 Today Episode దీపను చంపేస్తానంటూ జ్యోత్స్న వార్నింగ్ నిజం తెలిసి రగిలిపోయిన దశరథ్

Karthika Deepam 2 March 10th 2026 Today Episode : దీపను చంపేస్తానంటూ జ్యోత్స్న వార్నింగ్.. నిజం తెలిసి రగిలిపోయిన దశరథ్!

Karthika Deepam 2 March 10th 2026 Today Episode ఆస్పత్రిలో శౌర్య ఎమోషనల్.. డాక్టర్ మాటలతో శ్రీధర్‌కు డౌట్!

ఆస్పత్రిలో ఉన్న దీప దగ్గరకు శౌర్యను తీసుకుని వస్తాడు శ్రీధర్. లోపలికి వచ్చిన శౌర్యను చూసి కార్తీక్, దీప షాక్ అవుతారు. “అమ్మ అమ్మమ్మ వాళ్లింట్లో ఉందని అబద్ధం ఎందుకు చెప్పావ్ నాన్నా?” అని శౌర్య అడగడంతో కార్తీక్ కవర్ చేస్తాడు. “నీకు జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటావు కదా, మరి లోపల ఉన్న బేబీకి జ్వరం వస్తే ఎలా?” అంటూ శౌర్య ఎంతో అమాయకంగా అడిగిన మాటలకు కార్తీక్, దీప కంటతడి పెట్టుకుంటారు. తన బేబీ బొమ్మను దీప చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది శౌర్య. ఇంతలో డాక్టర్ హారిక మరో గైనకాలజిస్ట్‌తో కలిసి వస్తుంది. దీపకు టెస్టులు చేయాలని చెప్పగా.. “మీరు ఎన్ని టెస్టులైనా చేయండి, కానీ తల్లి, బిడ్డను కాపాడండి” అని శ్రీధర్ అంటాడు. అప్పుడు గైనకాలజిస్ట్ పొరపాటున “తల్లి, బిడ్డను కాపాడటం ఏంటి? బిడ్డ వద్దనుకున్నారు కదా!” అని అసలు నిజం బయటపెట్టేస్తుంది. ఆ మాట విన్న శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే తేరుకున్న కార్తీక్.. “టెస్టుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నారని, అందుకే వద్దన్నాను” అని కవర్ చేస్తాడు. కానీ శ్రీధర్ మనసులో మాత్రం బలమైన అనుమానం బీజం పడుతుంది.

Karthika Deepam 2 March 10th 2026 Today Episode జ్యోత్స్న సైకో వార్నింగ్.. దీపను చంపేస్తానంటూ..

మరోవైపు దాస్‌ను కలవడానికి వస్తుంది జ్యోత్స్న. “నన్ను ఎందుకు పిలిచావ్? నిజం చెప్పాలనుకుంటున్నావా?” అని జ్యోత్స్న అడగగా.. “లేని భయాలు మోసుకుంటూ తిరగొద్దు” అని దాస్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ జ్యోత్స్న వినదు. “నేను నీ కూతురిని కాదని చనిపోయిన నీ భార్య మీద ఒట్టు వేసి చెప్పు” అని డిమాండ్ చేస్తుంది. దానికి దాస్ షాక్ అవుతాడు. ఆ తర్వాత జ్యోత్స్న తనలోని అసలు సైకో కోణాన్ని బయటపెడుతుంది. “నేను దశరథ్ కూతురినే అని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది, అందరూ నమ్ముతున్నారు. కానీ నాకు ఇంకా డౌట్ ఉంది. మీరంతా కలిసి నా స్థానం దీపది అని ప్రూవ్ చేస్తే.. నేను బతకను, చచ్చిపోతాను. కానీ.. నేను చచ్చే ఒక్క నిమిషం ముందైనా సరే, దీపను చంపేస్తాను!” అని భయంకరమైన వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ తనకు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినా, దీపను బతకనివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశానని, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు దీపను చంపుతారో ఊహించలేరని బాంబ్ పేల్చుతుంది. “దీప బతకాలంటే నేను బతికి ఉండాలి.. శివనారాయణ గారి మనవరాలి స్థానంలో నేనే ఉండాలి” అని తేల్చి చెప్పి వెళ్లిపోతుంది.

ఆవేశంతో రగిలిపోయిన దశరథ్..

జ్యోత్స్న, దాస్ మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా చాటుగా వింటాడు దశరథ్. జ్యోత్స్న కిరాతక బుద్ధి చూసి రగిలిపోతాడు. దీప తన సొంత కూతురు అని తెలిసి కూడా జ్యోత్స్న కారణంగానే అందరూ సైలెంట్‌గా ఉంటున్నారని, దీపను ఏ క్షణమైనా జ్యోత్స్న చంపేస్తుందేమోనన్న భయంతోనే నిజం దాస్తున్నామని దాస్ వివరిస్తాడు. కానీ దశరథ్ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడు. “నా వల్ల నా కూతురు పడిన కష్టాలు చాలు. మౌనంగా ఉన్నా కూడా ప్రమాదమే దాసు. జ్యోత్స్న ఏదో చేసేదాకా నేను ఆగుతూ చూస్తూ కూర్చోలేను. నా కూతురిని నేను కాపాడుకుంటాను” అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దశరథ్ ఏం చేస్తాడోనని దాస్ తీవ్ర ఆందోళనకు గురవుతాడు.

కార్తీక్ అనుమానంలో శ్రీధర్.. దీపకు కార్తీక్ ధైర్యం

ఇంట్లో కాంచనతో ఆస్పత్రిలో జరిగిన విషయాలను చర్చిస్తాడు శ్రీధర్. డాక్టర్లు అన్న మాటలు వింటుంటే, కార్తీక్ మన దగ్గర ఏదో పెద్ద నిజం దాస్తున్నాడనిపిస్తోందని అంటాడు. జ్యోత్స్న అగ్రిమెంట్ నుంచి బయటపడే మార్గాలున్నా ఎందుకు వదిలేశాడు? ఇప్పుడు బిడ్డ విషయంలో ఎందుకు దాపరికాలు ఆడుతున్నాడు? అని అనుమానిస్తాడు. “ఒకవేళ వాడు తప్పు చేసి ఉంటే నా కొడుకును కూడా క్షమించను” అని కాంచన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆస్పత్రిలో శౌర్య మాటలు తలుచుకుని దీప బాధపడుతుంటుంది. అత్తయ్యకు, మావయ్యకు నిజం తెలిసిపోయి ఉంటుందని కంగారు పడుతుంది. అప్పుడు కార్తీక్ ఆమెకు ధైర్యం చెబుతాడు. తన చేతులతో దీపకు టిఫిన్ తినిపిస్తాడు. “అత్తకు ఏం కాదు, త్వరలోనే మనమంతా సంతోషంగా ఉంటాం. శౌర్యకు పెద్ద ఫ్యామిలీ దొరుకుతుంది. అప్పుడు మనం గ్రూప్ ఫొటో తీసుకుందాం, ముందు నువ్వు నవ్వు” అంటూ గిలిగింతలు పెట్టి దీప ముఖంలో నవ్వు తెప్పిస్తాడు కార్తీక్.

రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతోంది?

దీపను చంపేస్తానని జ్యోత్స్న ఇచ్చిన వార్నింగ్ తర్వాత దశరథ్ తీసుకోబోయే అడుగు ఏంటి? శ్రీధర్ తన అనుమానాలతో అసలు నిజం ఎలా బయటపెట్టబోతున్నాడు? కార్తీక్ దీపను జ్యోత్స్న బారి నుంచి ఎలా కాపాడుతాడు? అనేది రాబోయే ఎపిసోడ్స్‌లో మరింత ఆసక్తికరంగా మారనుంది. తదుపరి అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది