Chanakya Niti : ఎలాంటి పరిస్థితుల్లో అయినా బాధ్యతగా ఉండాలి.. ఇవి పాటిస్తే పేరు.. ప్రతిష్ఠలు మీ వెంటే అంటున్న చాణక్య
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు మనవ జీవన విధానం గురించి తన నీతి శాస్త్రంలో వివరించాడు. ఇందులోని నియమాలను ఇప్పటికీ ఎంతో మంది పాటిస్తారు. ఈ నీతిశాస్త్రం ప్రజల జీవన విధానాలను చాణక్య అనుభవంతో వివరించాడు. మానవులు స్వార్థపరులని డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకడుగు వేయరని అప్పట్లోనే చెప్పాడు. ఎటుంవంటి వారితో స్నేహం చేయాలో చెప్పాడు. విజయం సాధించాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో వివరించాడు. భార్యభర్తలు ఎలా ఉండాలి. తల్లిదండ్రలును ఎలా చూసుకోవాలి ఇలా ఎన్నో విషయాలను మానవులను దృష్టిలో పెట్టుకుని ఎలా ఉండాలో తన నీతి శాస్త్రంలో వివరించాడు.
అలాగే ప్రతి మనిషిలో కోపం, స్వార్థం, ప్రేమ, మానవత్వం ఉంటాయని చెప్పాడు. స్వార్థ పరులకు దూరంగా ఉండాలని, ప్రశంసలకు పొంగిపోకూడదని చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లో నైనా తన కర్తవ్యాలను మర్చిపోకుండా ఉండాలని సూచించాడు. అంతే కాకుండా ఎంతో మందికి చాలా రకాలుగా చాలా సార్లు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని వాటికి భయపడకుండా ఎలా నిలబడాలో వివరించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…లైఫ్ లో కష్ట నష్టాలు.. సుఖ సంతోషాలు అందరికీ వస్తాయని.. ఆ సమయంలో ఎవరైతే తన బాధ్యతలు, విధులను విస్మరించకుండా నిర్వర్తిస్తారో వారే సక్సెస్ అవుతారని..

chanakya Niti followed you Name Prestige is speak after
వాళ్లకే పేరు ప్రతిష్టలు వస్తాయిని ఆచార్య చాణక్య నీతి శాస్త్రంలో చెప్పాడు. ఎవరైతే లక్ష్య సాధనకు కష్టపడి పని చేస్తారో వాళ్లే చరిత్రలో నిలిచిపోతారని చెప్పాడు. సొసైటీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఎనిమీస్ కూడా ప్రశంసించేలా ఎదుగుతారని వివరించాడు.ఎవరైతే ఎంత తెలుసుకున్నా ఎన్ని విజయాలు సాధించినా.. ఇంకా నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారో వాళ్లు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని, వీళ్లను సంపద ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుందిని చెప్పాడు. అలాగే కష్టాల్లో కుంగిపోకుండా సమస్యలను ఎదుర్కొని నిలబడతారో వాళ్లు సక్సెస్ అవుతారిని వివరించాడు.