Chanakya Niti : కోడిపుంజులోని ఈ లక్షణాలు అనుసరిస్తే జీవితంలో విజయం సాధించినట్లు… చాణక్యుడు నీతి ఏం చెబుతుందంటే…!
ప్రధానాంశాలు:
Chanakya Niti : కోడిపుంజులోని ఈ లక్షణాలు అనుసరిస్తే జీవితంలో విజయం సాధించినట్లు...చాణక్యుడు నీతి ఏం చెబుతుందంటే...!
Chanakya Niti : ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలలో ఆచార్య చాణక్యుడు కూడా ఒకరు. అయితే నేటికి కూడా చానక్యుడు జీవితంలో ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన విధానాల గురించి నీతి శాస్త్రం ద్వారా చెబుతూ వచ్చారు. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ మానసిక దృఢత్వం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైన పరిష్కారం అవుతాయని చాణక్యుడు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రకృతి ఒక పాఠశాలగా భావించాలని దానిలోని జీవులన్నీ జీవిత పాఠాలను నేర్పించే పుస్తకాలని చాణక్యుడు పేర్కోనడం జరిగింది. అందుకే చాణక్యుడి నీతి వ్యాఖ్యలు నేటి తరానికి ఆచరణీయమని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలో విజయం సాధించడానికి ప్రకృతి ఒక పుస్తకం లాగా పనిచేస్తుందని ,దాని వినియోగించుకుని విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు. ఇక ఈ ప్రకృతిలో ఉండే జీవుల్లో కోడి పుంజు కూడా ఒకటి. దీనికి సంబంధించిన నాలుగు ముఖ్యమైన లక్షణాలను చాణక్యుడు వివరించారు. అంతేకాక కోడిపుంజులలో ఈ నాలుగు లక్షణాలను అనుసరించిన వారు కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారని వెల్లడించాడు.
Chanakya Niti సానుకూలంగా వ్యవహరించడం
సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా విజయం సాధిస్తారని చాణిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు.
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం.
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన ముఖ్యమైన పని. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కోడికూస్తుంది. అదేవిధంగా సూర్యోదయానికి ముందే మనుషులు కూడా నిద్ర లేచి వారి పనులను పూర్తి చేసుకోవాలని అలాంటివారు జీవితంలో అనుకున్నది సాధిస్తారని చాణక్యుడు తెలిపారు.
Chanakya Niti ధైర్యంగా పోరాటం
జీవితంలో వచ్చే సమస్యలను ధైర్యంగా పోరాడటం అలవాటు చేసుకోవాలని చానక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. మీ జీవితంలో మీరు విజయం సాధించాలంటే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని అన్ని అడ్డంకులను తట్టుకోవాలని తెలిపారు.
నిజాయితీగా సంపాదించు
మనిషి జీవితంలో నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బు సంతృప్తిని ఇస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందాన్ని శాంతిని మరింత పెంచుతుంది.
ఇతరులపై ఆధారపడవద్దు
కోడిపుంజు తన కడుపుని తాను నింపుకుంటుంది. ఇతరులపై అస్సలు ఆధారపడదు. అదేవిధంగా మనిషి కూడా తన జీవితంలో ఇతరులపై ఆధారపడకుండా తన సొంత కాళ్ళ పై నిలబడి జీవితంలో ముందుకు వెళ్లాలని చాణక్యుడి తెలిపారు.