Lunar Eclipse : మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం .. ఏటైంలో గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది .. పాటించాల్సిన నియమాలు ఇవే ..!

Authored By Suma | The Telugu News | Updated on : 3 March 2026, 11:00 am
  •  Lunar Eclipse : మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం .. ఏటైంలో గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది .. పాటించాల్సిన నియమాలు ఇవే ..!

Lunar Eclipse : మార్చి 3వ (ఈరోజు) తేదీన అరుదైన చంద్రగ్రహణం సంభవించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహణం సందర్భంగా పండితులు, జ్యోతిష్య నిపుణులు కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయాల్లో ఆచరించాల్సిన విధానాలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎప్పుడు వరకు ఆహారం తీసుకోవచ్చన్న విషయాలపై వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Here are the details of the lunar eclipse.

Lunar Eclipse : మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం .. ఏటైంలో గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది .. పాటించాల్సిన నియమాలు ఇవే ..!

Lunar Eclipse : ఖగోళ శాస్త్రవేత్తల వివరణ

ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా సూర్యుడు మరియు భూమి ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఆ మార్గానికి సుమారు ఐదు డిగ్రీల కోణంలో అటూ ఇటూ సంచరిస్తుంటాడు. అయితే పూర్ణిమ రోజున భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రునిపై భూమి నీడ పడుతుంది. అప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. మార్చి 3న మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:48 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగనుంది. మొత్తం గ్రహణ కాలం 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణం చివరి 27 నిమిషాలు పాక్షికంగా కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Lunar Eclipse : జ్యోతిష్య పరంగా ప్రభావం

జ్యోతిష్య నిపుణుల ప్రకారం సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖలో ఉండి చంద్రుడు రాహు లేదా కేతు సమీపంలో ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. పూర్తిగా చంద్రబింబం కనిపించకపోతే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు; కొంత భాగం మాత్రమే కనిపించనప్పుడు పాక్షిక చంద్రగ్రహణంగా వ్యవహరిస్తారు. ఈసారి గ్రహణం సింహ రాశిలో, పూర్వఫల్గుణి (పుబ్బ) నక్షత్రంలో కేతు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడనుంది. సింహ, కర్కాటక, మకర, కుంభ రాశుల వారికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే మేషం, మీనం, ధనుస్సు, వృశ్చికం, కన్య తదితర రాశులపై కూడా ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ రాశుల వారు గ్రహణ శాంతులు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Lunar Eclipse : గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయడం, జపాలు, శాంతులు చేయడం వంటి ఆచారాలు పాటించాలి. గృహస్థులు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం ముగించటం శ్రేయస్కరం. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు గ్రహణానికి అరగంట ముందు వరకు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదని పండితులు సూచిస్తున్నారు. వారు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ భగవన్నామ స్మరణ చేయడం ఉత్తమమని చెబుతున్నారు. గ్రహణ సమయంలో తలుపులు, కిటికీలు మూసివేయడం మంచిదని భావిస్తారు. మలమూత్ర విసర్జనలకు ప్రత్యేక నిషేధాలు లేవు. గ్రహణానికి మూడు గంటల ముందు ఘన ఆహారం తీసుకోవడం ముగించాలి. ద్రవ పదార్థాలు గ్రహణానికి గంటన్నర ముందు వరకు తీసుకోవచ్చు. గ్రహణం పూర్తయిన తరువాత తలస్నానం చేసి, కొత్తగా వండిన ఆహారం తీసుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారం తినరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. శారీరక శక్తి ఉన్నవారు గ్రహణానికి ముందు, తర్వాత స్నానం చేసి జపాలు, ధ్యానం చేయడం ద్వారా రెట్టింపు ఫలితం పొందవచ్చని పండితులు పేర్కొంటున్నారు. గ్రహణ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు సూచిస్తున్నారు.

చంద్రగ్రహణ వివరాలు..

గ్రహణం సూతకాలం ప్రారంభమయ్యే సమయం: మార్చి 3 ఉదయం 6.22 గంటలకు

గ్రహణం మొదలయ్యే సమయం ( గ్రహణ స్పర్శకాలం) : మార్చి 3 మధ్యాహ్నం 3:21 గంటలు

గ్రహణం మధ్యలోకి వెళ్లే సమయం ప్రారంభం ( ఉన్మీలన కాలం): మార్చి 3 సాయంత్రం 5:02 గంటలకు .. గ్రహణం ప్రభావం తీవ్రతరంకావడం ప్రారంభిస్తుంది.

గ్రహణ మధ్య కాలం : మార్చి 3 సాయంత్రం 5:32 గంటలకు .. ఈ సమయంలో గ్రహణం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.

గ్రహణం పూర్తిగా పట్టే సమయం (నిమీలన కాలం) : మార్చి 3 సాయంత్రం 5:48 గంటలకు .. ఇప్పటి వరకు గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది.

గ్రహణం విడవడం ప్రారంభించే సమయం (గ్రహణ మోక్షకాలం) : మార్చి 3 సాయంత్రం 6:12 గంటలు గంటలకు .. గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది.

గ్రహణం పూర్తిగా ముగిసే సమయం (అద్యంత పుణ్యకాలం).. మార్చి 3 సాయంత్రం 6:48 గంటలకు పూర్తిగా గ్రహణ ప్రభావం తగ్గుతుంది.

హైదరాబాద్​ సహా భారతదేశంలో కనపడే సమయం : మార్చి 3 సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాలు

 

 

Advertisement

Suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి