Chanakya Niti : ఈ 5 లక్షణాలను మీలో ఇముడ్చుకోగలగితే విజయం మీ సొంతం అంటున్న చాణక్యుడు..
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు ఏ ప్రమాదాన్ని అయినా ముందుగానే తెలుసుకొని దాని నుంచి తప్పించుకునే మార్గాలను సిద్ధం చేసేవారు ఆచార్య చాణుక్యకు ఆర్థిక శాస్త్రంఅన్న , రాజకీయాల మీద మక్కువ , సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై మంచి పట్టు ఉంది ఆచార్య చాణక్యుడికి ఈయన తన జీవితంలో జరిగిన అనుభవాలను, విజయాలను నీతి శాస్త్రంలో పొందుపరిచారు. ఈ పుస్తకమే ఇప్పుడు నేటి పరిశోధకులకు ఉపయోగపడుతుంది. పుస్తకంలోని అంశాలను పాటించడం వల్ల మానవ జీవితానికి వైఫల్యం అనేది ఉండదు అని నేటి పరిశోధకులు తెలుపుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..కష్టపడి పనిచేయడం ఇలా చేయడం వల్ల కష్టం విలువ తెలుస్తుంది.
మనిషి ఎదుగుదలకు కష్ట పడి పని చేయడం అనే పదమే తొలిమెట్టు. మనం కష్టపడి పనిచేయడం వల్ల శ్రమకు తగిన ఫలితం కూడా దక్కుతుంది. అందుకే బద్దకాన్ని వీడి కష్టపడి పని చేయడం మంచిది.ఆత్మవిశ్వాసం ఇది లేకపోతే మనం ఏ పని చేయలేము మనిషికి ఆత్మవిశ్వాసం అనేది గొప్ప ఆస్తి. ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా మొదలు పెట్టడం వల్ల అందులో మంచి ఫలితమే మనిషికి దక్కుతుంది.మనం సంపాదించుకున్న జ్ఞానం ఇది ఎప్పుడు కూడా మన తో పాటే ఉంటుంది. డబ్బు, స్నేహితులు, బంధువులు, భార్య లేదా భర్త, దూరమై పోయినప్పటికీ మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.
Chanakya Niti : డబ్బు జీవితంలో ప్రధానాంశం…
డబ్బును సంపాదించడం మనిషి జీవితంలో ప్రధానాంశం. ప్రస్తుత కాలంలో డబ్బు లేనిది ఏ పని జరగడం లేదు. కావున మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం చెడు సమయంలో ఈ డబ్బే మనల్ని ఆ కష్టాల నుంచి దూరం చేస్తుంది. అప్రమత్తంగా ఉండడం మనిషి జీవితంలో విజయాలను సాధించాలన్న, కష్టాల నుంచి బయట పడాలి అన్నా అసలు ఆ కష్టాలే మన చెంతకి రాకూడదు అన్నా అప్రమత్తంగా ఉండడం ఈ లక్షణాలన్నీ మొదటగా అలవాటు చేసుకోవాలి ఇలా అప్రమత్తంగా ఉండటం కారణంగా సమస్యలకు దూరంగా ఉండి మంచి విజయాలను మన జీవితంలో చూడగలము.