Chanakya Niti : చాణక్యుడి నీతి మన అందరికి తెలిసిందే. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. మన లక్ష్యాలను ఎలా సాధించుకోవాలి.. క్రమశిక్షణ విధానం ఇలా ఎన్నో మార్గదర్శకాలను సూచించారు. చాణక్యుడి నీతిని ఆయన రచించిన గ్రంథాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. చరిత్రలో ఎంతోమంది మేధావులు ఉన్నా ఇప్పటికి కూడా ఆయన నీతిని ఫాలో అవుతుంటారు. అంటే ఆయన ఎంత ప్రభావవంతంగా నీతి సూత్రాలను బోధించారో అర్థం చేసుకోవచ్చు. ఇక చాణక్యుడి జీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. చాణక్యుడి అసలు పేరు విష్ణు గుప్తుడు మరియు కౌటిల్యుడు. ఆయన రచించిన నీతిశాస్త్రం ప్రజలకు జీవిత విధానాలను నేర్పిస్తుంది.మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు.
కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని పిలుస్తారు.చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా పట్టు సాధించాడే . ఇతడు తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ఎంతో ప్రసిద్ధి చెందింది.చాణక్య నీతి శాస్త్రంలో ఆర్థిక విషయాల గురించి కూడా ప్రస్తావించాడు. చెడ్డ అలవాట్ల వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించాడు. ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే అలవాట్లను మానుకోవాలని చెప్పాడు. చాలా సార్లు ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని ఈ సమస్యలని జీవిత భాగస్వామితో తప్ప వేరే వారితో పంచుకోకూడదని సూచించాడు.
ఎందుకంటే ఇతరులతో సమస్యల గురించి చర్చించడం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరుగుతుందని, తెలివైన వ్యక్తి ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని రహస్యంగా ఉంచుతాడని చెప్పుకొచ్చాడు.ఆలస్యంగా లేవడం ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఎక్కువ సేపు పడుకోవడం వల్ల దరిద్రం తాండవిస్తుంది. రోజంతా ఏదో ఒక కారణం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి త్వరగా లేవడానికి ప్రయత్నించాలని చెప్పాడు. నిన్ను గౌరవించని చోట, జీవనోపాధి పొందలేని చోట, స్నేహితులు లేని చోట, జ్ఞానం గురించి మాట్లాడని చోట ఒక్క క్షణం కూడా ఉండవద్దని చాణక్యుడు భోదించాడు.అదృష్టం మీద ఆధారపడి పనిచేసే వ్యక్తులు సోమరితనం, అజాగ్రత్త పరులుగా మారతారని హెచ్చరించారు. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. ఎప్పుడూ ఒకే చోట నిలవదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనం లభించినట్లయితే ఆ డబ్బు వృథా చేయకూడదని చాణక్య నీతి సూచిస్తుంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.