Chanakya Niti : చాణ‌క్యుడి నీతిని ఫాలో అవుతే.. మీరు కోటీశ్వ‌రులే ఇక‌… ఎందుకో తెలిస్తే షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chanakya Niti : చాణ‌క్యుడి నీతిని ఫాలో అవుతే.. మీరు కోటీశ్వ‌రులే ఇక‌… ఎందుకో తెలిస్తే షాక్

Chanakya Niti : చాణక్యుడి నీతి మ‌న అంద‌రికి తెలిసిందే. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. మ‌న ల‌క్ష్యాల‌ను ఎలా సాధించుకోవాలి.. క్ర‌మ‌శిక్ష‌ణ విధానం ఇలా ఎన్నో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించారు. చాణక్యుడి నీతిని ఆయన రచించిన గ్రంథాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. చరిత్రలో ఎంతోమంది మేధావులు ఉన్నా ఇప్పటికి కూడా ఆయ‌న‌ నీతిని ఫాలో అవుతుంటారు. అంటే ఆయన ఎంత ప్రభావవంతంగా నీతి సూత్రాలను బోధించారో అర్థం చేసుకోవచ్చు. ఇక చాణక్యుడి జీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :30 March 2022,7:00 am

Chanakya Niti : చాణక్యుడి నీతి మ‌న అంద‌రికి తెలిసిందే. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. మ‌న ల‌క్ష్యాల‌ను ఎలా సాధించుకోవాలి.. క్ర‌మ‌శిక్ష‌ణ విధానం ఇలా ఎన్నో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించారు. చాణక్యుడి నీతిని ఆయన రచించిన గ్రంథాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. చరిత్రలో ఎంతోమంది మేధావులు ఉన్నా ఇప్పటికి కూడా ఆయ‌న‌ నీతిని ఫాలో అవుతుంటారు. అంటే ఆయన ఎంత ప్రభావవంతంగా నీతి సూత్రాలను బోధించారో అర్థం చేసుకోవచ్చు. ఇక చాణక్యుడి జీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. చాణక్యుడి అసలు పేరు విష్ణు గుప్తుడు మరియు కౌటిల్యుడు. ఆయన రచించిన నీతిశాస్త్రం ప్రజలకు జీవిత విధానాలను నేర్పిస్తుంది.మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా కూడా కొన‌సాగారు.

కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని పిలుస్తారు.చాణక్యుడు అర్థ‌శాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా ప‌ట్టు సాధించాడే . ఇతడు తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ఎంతో ప్రసిద్ధి చెందింది.చాణక్య నీతి శాస్త్రంలో ఆర్థిక విషయాల గురించి కూడా ప్రస్తావించాడు. చెడ్డ అలవాట్ల వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించాడు. ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే అలవాట్లను మానుకోవాలని చెప్పాడు. చాలా సార్లు ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటార‌ని ఈ సమస్యలని జీవిత భాగస్వామితో తప్ప వేరే వారితో పంచుకోకూడదని సూచించాడు.

Chanakya Niti is followed You are a billionaire

Chanakya Niti is followed You are a billionaire

Chanakya Niti : చాణ‌క్య నీతి ఎన్నో విష‌యాలు..

ఎందుకంటే ఇతరులతో సమస్యల గురించి చర్చించడం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరుగుతుందని, తెలివైన వ్యక్తి ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని రహస్యంగా ఉంచుతాడని చెప్పుకొచ్చాడు.ఆలస్యంగా లేవడం ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఎక్కువ సేపు పడుకోవడం వల్ల దరిద్రం తాండవిస్తుంది. రోజంతా ఏదో ఒక కారణం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి త్వరగా లేవడానికి ప్రయత్నించాలని చెప్పాడు. నిన్ను గౌరవించని చోట, జీవనోపాధి పొందలేని చోట, స్నేహితులు లేని చోట, జ్ఞానం గురించి మాట్లాడని చోట ఒక్క క్షణం కూడా ఉండవద్దని చాణక్యుడు భోదించాడు.అదృష్టం మీద ఆధారపడి పనిచేసే వ్యక్తులు సోమరితనం, అజాగ్రత్త పరులుగా మారతార‌ని హెచ్చ‌రించారు. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. ఎప్పుడూ ఒకే చోట నిలవదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనం లభించినట్లయితే ఆ డబ్బు వృథా చేయకూడద‌ని చాణ‌క్య నీతి సూచిస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది