Chanakya Niti : పురుషులు ఈ లక్షణాలు కలిగి ఉంటే… మహిళలు వారిని కచ్చితంగా ఇష్టపడతారు అంటున్న చాణక్య… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : పురుషులు ఈ లక్షణాలు కలిగి ఉంటే… మహిళలు వారిని కచ్చితంగా ఇష్టపడతారు అంటున్న చాణక్య…

 Authored By aruna | The Telugu News | Updated on :25 September 2022,6:00 am

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఈ నీతి శాస్త్రంలో సమాజానికి సంబంధించిన అనేక విషయాలను చాణక్యుడు ప్రస్తావించాడు. ఒక మనిషి జీవితంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. ఎటువంటి మార్గంలో వెళ్లాలి మొదలగు విషయాలను ఆ నీతి శాస్త్రంలో వివరించాడు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యమైన నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు అయితే జీవితాంతం బాధపడాల్సిందే. ఈ కారణంగా స్త్రీలు పురుషులు తమకు తాముగా జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. ప్రతి విషయంలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. 1) సాధారణంగా స్త్రీలు తన కాబోయే భర్త ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు.

ఎవరైనా తక్కువ మాట్లాడితే అతని లక్షణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాంటి పురుషుల పట్ల స్త్రీలు త్వరగా ఆకర్షితులవుతారు. అతడు జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంటారని చాణక్యులు పేర్కొన్నారు. కోపం మనిషిని నాశనం చేస్తుందని ప్రశాంత స్వభావం విజయానికి కీలకమని చాణక్యుడు చెబుతున్నాడు. 2) స్త్రీలు పురుషులు తమ జీవిత భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే చాలామంది స్త్రీలు పురుషుల వ్యక్తిత్వం పై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు.

Chanakya Niti men have these qualities women love him

Chanakya Niti men have these qualities women love him

స్ర్తీలు అత్యాశ లేదా అహంకార స్వభావం కలిగి ఉన్న పురుషులకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. స్త్రీలు నిజాయితీగా విధేయతతో ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. 3) పురుషులే కాదు మహిళలు కూడా మంచి జీవిత భాగస్వామిని కోరుకుంటారు. ఎల్లప్పుడు సహాయం చేసే గుణం ఉన్న వారిని ఇష్టపడతారు. చాలామంది స్త్రీలు నీచంగా ఉండే పురుషులను ద్వేషిస్తారు. ఎల్లప్పుడూ ఇతరులకు చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. మనిషికి సహాయం చేసే గుణం కూడా ఉండాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది