Chanakya Niti : కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారా? చాణుక్యుడు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి..
Business Tips : ప్రస్తుతం కొవిడ్ టైంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఈ టైంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల బిజినెస్ లాస్ అయ్యే చాన్స్ ఉంది. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించారు. ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టే టైంలో.. సదరు వ్యక్తి తన ఆలోచనలు సానుకూలంగానూ, స్థిరంగానూ ఉండేలా చూసుకోవాలి. నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోకూడదు. దాని వల్ల జీవితంలో ఎక్కువగా ముందుకు వెళ్లలేము. అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు సాగాలి. ఇలాంటి సమయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అలాంటి వాటిలో వెనకడుగు వేయొద్దు. భాగస్వాముల విషయంలోనూ నిర్లక్ష్యం పనికిరాదు. అలా చేస్తే మోసపోయే చాన్స్ ఉంది.ఏదైనా పనిని స్టార్ట్ చేసే టైంలో దానిని మనం పూర్తి చేయగలమా లేదా అని ముందే ఆలోచించుకోవాలి. ఒక వేళ ఆ పనిని సరిగ్గా చేయలేకపోతే మరో ప్రత్యామ్నాయ పనిని సిద్ధంగా ఉంచుకోవాలి. అలా చేస్తేనే సక్సెస్ అవుతాము. కొత్తగా పనిని స్టార్ట్ చేసే టైంలో సదరు వ్యాపారి తన ఉపన్యాసంపై నియంత్రణ కలిగి ఉండాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే వ్యాపారంలో నష్టం వాటిల్లే చాన్స్ ఉంది.
Chanakya Niti : కఠిన నిర్ణయాలు తప్పనిసరి..
బిజినెస్‌లో కొత్త పనిని స్టార్ట్ చేయడం వల్ల బయటి వ్యక్తికి ఆ విషయాన్ని ముందే చెప్పకూడదు. ఈ విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వ్యాపారం విజయవంతంగా కొనసాగించాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. రిస్క్ తీసుకోవాలి లేదంటే విజయం సాధించడం కష్టం. బిజినెస్ ప్రారంభించే ముందు టైం, ప్లేస్ అందులోని పార్టనర్స్ ఎవరు మీకు సహాయపడతారో తెలుసుకోవాలి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది బిజినెస్‌లో తమ పార్ట్నర్ లను మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్త అవసరం.