Chanakya Niti : ఎవరితోనూ ఈ ఐదు సీక్రెట్లు పంచుకోకూడదంటున్న చాణక్య..!
Chanakya Niti : తన జీవితంలో ఎదురైన అనుభవాలతో ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటికి అనుసరణీయం. అందులోని విషయాలు ప్రతీ ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. మనం సంతోషంగా.. ఎటువంటి సమస్యా లేకుండా జీవించడానికి ఈ నీతి శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాణక్యుడు ఇందులో చెప్పిన విషయాలను పాటిస్తే… ఎవరైనా కచ్చితంగా విజయం సాధిస్తారని పెద్దల నమ్మకం. అయితే మనకు చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు, విపరీతమైన దుఃఖం కల్గినప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే బాధ తగ్గిపోతుందని అందరూ చెప్తుంటారు. కానీ అలా చేయడం వల్ల బాధ తగ్గడం ఏమో కానీ సమస్యలు పెరుగుతాయని చాణక్యుడు చెప్పాడు. మీకు కల్గిన బాధ, దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని… మీ బాధను మీలో మాత్రమే ఉంచుకోవాలని అంటున్నాడు. ఒక వేళ మీ సమస్యలు వేరే వాళ్లతో పంచుకుంటే… మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నాడు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి సంపద నశించినప్పుడు, మనసులో దుఃఖం ఉన్నప్పుడు, భార్య ప్రవర్తన తెలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్లతో చర్చించవద్దు. మీరు చెప్పిన విషయాలను విని.. మీతో వారికి ఎప్పుడైనా గొడవ జరిగితే మీకు ఆ విషయాలు గుర్తు చేసి మిమ్మల్ని అవమానించే అవకాశం ఉందని ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వివరించాడు.అలాగే డబ్బు ప్రతి మనిషికి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందనేది చాణక్యుడి నమ్మకం. అయితే మీకు ఎప్పుడైనా నష్టం వచ్చి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటే దాని గురించి ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే మీరు డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసిన తర్వాత మీకు సహాయం చేసే వ్యక్తులు కూడా సాయం చేసేందుకు దూరంగా ఉంటారు. అందుకే అలా చేయకూడదని చాణక్యుడు నీతి శాస్త్రంలో వివరించాడు.మీరు బాధలో ఉన్నా..
మనస్సు విచారంగా ఉన్నప్పటికీ… ఈ విషయాన్ని ఎవరితోనూ ఎప్పుడూ చర్చించకూడదని చాణక్య చెబుతున్నారు. మీ బాధను తెలుసుకుని ముందు ఓదార్చినా… ఆ తర్వాత మీ సమస్యలను వేరే వాళ్లతో చెప్తూ… ఎగతాళి చేస్తారు.ఒకవేళ ఎవరి భార్య ప్రవర్తన బాగాలేకపోయినా అంటే ఆమె వేరే వాళ్లతో అక్రమ సంబంధాల్లాంటివి పెట్టుకున్నా ఎవరితోనూ చెప్పకూడదు. అది మీ భార్య అయినా సరే ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే మీ భార్య ప్రవర్తన బాగాలేదంటే మీరు సమాజంలో తల ఎత్తుకొని తిరగడం కష్టమవుతుంది. మీరు ఎక్కుడైనా, ఎప్పుడైనా, ఏ కారణంతోనైనా అవమానానికి గురైతే ఆ విషయాన్ని ఎవరితోనూ ప్రస్తావించకండి. ఆ అవమానాన్ని మనసులో దాచుకొని.. శాంతిగా నడుచుకోండి. ఇతరులతో చర్చించడం వల్ల మీ గౌరవం పోగొట్టుకు్న వాళ్లు అవుతారు.