Chanakya Niti : మనుషులు ఈ 4 పక్షుల నుండి ఈ గుణాలను అలవర్చుకుంటే జీవితంలో ఇక తిరిగి ఉండదు.. చెప్తున్న చాణిక్య…
Chanakya Niti : ఆచార్య నీతి శాస్త్రంలో మనిషి యొక్క జీవితం గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. ఆ విషయాలను మనిషి పాటిస్తే జీవితం విజయవంతంగా సాగుతుంది అని తెలియజేశాడు. అలాగే మనిషి పక్షుల నుంచి గుణాలను అలవర్చుకుంటే ఆ మనిషి జీవితంలో ఇక తిరిగి ఉండదు.. ఒక మనిషి ఎటువంటి పక్షులలో ఎటువంటి లక్షణాలను స్వీకరించాలో తెలుసుకుందాం… కోడిపుంజు: కోడిపుంజు సూర్యోదయానికి ముందే లేస్తుంది. అలాగే వ్యతిరేక శక్తులపై పోరాడుతుంది.
అలాగే ఆహారాన్ని పంచడం, మీ స్వయం శక్తితో ఆహారాన్ని అందుకోవడం, ఇలాంటి గుణాలన్నీ కోడి నుంచి మనిషి అలవర్చుకోవచ్చు. ఈ గుణాలు మనిషి అలవర్చుకుంటే విజయాల్ని అందుకుంటాడు. కోకిల: కోకిల రూపం కన్నా దాని స్వరమే మధురమైనది. దాని స్వరం ప్రసిద్ధి చెందింది. ఈ లక్షణాన్ని మనిషి ఆలవర్చుకోవడం వలన వ్యక్తి ప్రజల్ని తన వైపు ఆకర్షించగలడు. కావున అందరితో మధురమైన స్వరంతో మాట్లాడాలి. దీంతో మనిషి ఎలాంటి వారినైనా సొంతం చేసుకోవచ్చు.
కొంగ: ఈ కొంగ దాని ఇంద్రియాలు ఎలా కంట్రోల్ చేయాలి తెలుసు. అలాగే జీవితాన్ని ఎంతో ఆలోచన కరంగా చేసుకుంటే సక్సెస్ సులువుగా అందుతుంది. ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోలేని మనిషి ఎప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున మీ మనసును ఎప్పుడు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. మంచి ఆలోచనతో ముందు అడుగు వేయండి. అన్ని విజయాలే జరుగుతాయి. ఈ విధంగా ఈ మూడు పక్షుల లక్షణాలను అలవర్చుకుంటే ఇక మీకు జీవితంలో తిరిగి ఉండదు.