Chanakya Niti spiritual speech about wife and husband relation
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన గొప్ప విద్యావేత్త, బుద్ధి బలం కలవాడు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికి ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఒక మనిషి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి ఇలా మొదలగు విషయాలను చాణుక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ నీతి శాస్త్రంలో భార్యాభర్తలు కలకాలం ప్రేమగా సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను పాటించాలి అని చాణుక్యలు పేర్కొన్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) భార్య భర్తల సంబంధంలో సందేహాలు అనేవి ఉండకూడదు. ఎప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఇద్దరి మధ్య సందేహాలు ఉంటే ఆ సంబంధం నాశనం అవుతుంది. కనుక భాగస్వామిని ఎప్పుడు అవమానించకూడదు. మీ భాగస్వామి గురించి ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే అడగడం ద్వారా సందేహాలు ఆలోచనలను దూరం చేసుకోవచ్చు. 2) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం భార్యాభర్తల సంబంధంలో అహంకారం అనేది ఉండకూడదు. ఇది మీ సంబంధంలో వివాదాలకు కారణం కావచ్చు. అహంకారం వలన భాగస్వామి నుండి దూరం చేస్తుంది. కాబట్టి అహంకారానికి దూరంగా ఉండాలి.
Chanakya Niti spiritual speech about wife and husband relation
3) భార్య భర్తల ప్రేమలో ఎటువంటి మోసం ఉండకూడదు. ప్రేమను జీవిత భాగస్వామికి తెలియజేయడం ఏకైక మార్గం స్వచ్ఛత అని చాణక్యుడు తెలియజేశారు. మనిషి స్వార్థం కంటే ప్రేమకు లొంగిపోతాడు. 4) భార్యాభర్తల సంబంధం లో ఒకరినొకరు స్వేచ్ఛను ఇచ్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకు ఒకరినొకరు నిదించుకోకూడదు. ఇలా చేయడం వలన సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య ప్రేమ కలకాలం ఉంటుంది.
JC Prabhakar Reddy : వైసీపీ Ysrcp అధినేత జగన్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంతపురం జిల్లాకు చెందిన,…
Thalliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు…
Ration Shops : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రేషన్ దుకాణాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం సహా అనేక ప్రాంతాల్లో రేషన్ డిపోల వద్ద…
Heroine : తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించిన హీరోయిన్ అమలా పాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
AP Government : ఏపీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. ఖరీఫ్ పంట బీమా పథకానికి రూ.132.58 కోట్ల…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న “దీపం-2” పథకంలో ముఖ్యమైన మార్పు చేపట్టింది.…
Belly Fat Melts Away : మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చని తెలుసా?…
Today Gold Rate : జూన్ 1న బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
This website uses cookies.