Chanakya Niti : మీకు ఇష్టమైన మిత్రుడు అయినా సరే ఈ నాలుగు విషయాలను వారితో చెప్పవద్దు.. అంటున్న చాణిక్య
Chanakya Niti : ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని చాలా నమ్ముతుంటాం. వారితో అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటాం అలా చేయడం అనేది మనం చేసే పెద్ద తప్పు వారు మన మిత్రుడే కదా ఏదైనా చెప్పవచ్చు అని గుడ్డిగా చెబుతుంటాము. అలా చెప్పడం వలన, ఎన్నో సమస్యలు, ఎదురవుతూ ఉంటాయి. అని చాణిక్య చెప్తున్నారు. అసలు ఎందుకు? ఎలాంటి కష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..నీకు ఆపద వచ్చిన సమయంలో నిన్ను బాధ పడకుండా చేసేది డబ్బులు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు జీవితం మీద ఆశ కలిగించేది డబ్బు కాబట్టి, ఆ డబ్బులను పొదుపుగా, వాడుకోవాలి.
అలాగే వాటిని దాచుకోవాలి. కానీ వాటి గురించి ఎవరితోనూ ముచ్చంటిచ్చవద్దు.అని అంటున్నారు చాణిక్య. అలాగే మీ ఇంట్లో కొన్ని సమయాలలో ఘర్షణలు, జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు మీకు ఎంతో ఇష్టమైన మిత్రుడు ఆయన సరే, ఆ గొడవలు గురించి చెప్పవద్దు.మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. కానీ ఇలా చెప్పుకోవడం వలన, మీ ఇంట్లో ఇంకా సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా అగౌరవంగా చూసినట్లయితే దానిని మీరు ఇతరులతో పంచుకోవద్దు. దానిని మీ మనసులోనే ఉంచుకోండి. అలా కాకుండా మీరు ఇతరులతో చెప్పడం.
వలన, వారు ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికీ ఇలాంటి విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. అలాగే మీలో ఎటువంటి బాధ ఉన్న కానీ మీరు ఎంతగానో నమ్ముతున్న వ్యక్తితో మాత్రం ఆ బాధను పంచుకోవద్దు. ఇలా పంచుకోవడం వలన, మీ సమస్యకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ మీలో ఉన్న వీక్నెస్ ను తెలుసుకుంటారు. ఆ వీక్నెస్ ను పట్టుకొని మీతో ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే ఎవరిని ఎంతవరకు నమ్మాలో, అంతవరకు మాత్రమే నమ్మాలి. అని చాణిక్య అంటున్నారు.